ఫ్రెండ్‌షిప్‌ డేపై RGV సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

దిశ, సినిమా : అందరూ ఫ్రెండ్‌షిప్ డే సంబరాల్లో మునిగితేలుతుంటే.. ఆర్జీవీ మాత్రం ‘ఎనిమీషిప్ డే’ జరుపుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు స్నేహితుడి కంటే శత్రువే బెటర్ అని.. ఫ్రెండ్‌ను నమ్ముకుంటే నట్టేట మునగాల్సిందేనని వరుస ట్వీట్స్ చేశాడు. దోస్తుల మాదిరిగా శత్రువులు మిత్రద్రోహం చేయలేరన్న వర్మ.. శత్రువులు మనల్ని ధైర్యంగా ఫేస్ చేస్తే, ఫ్రెండ్స్ మాత్రం వెన్నుపోటు పొడుస్తారని వివరించాడు. ఎనిమీస్ మన బలాన్ని సీరియస్‌గా తీసుకుంటే, స్నేహితులు మాత్రం కాన్ఫిడెన్స్ లూజ్ చేయడంలో ముందుంటారని చెప్పాడు. […]

Update: 2021-08-01 08:57 GMT

దిశ, సినిమా : అందరూ ఫ్రెండ్‌షిప్ డే సంబరాల్లో మునిగితేలుతుంటే.. ఆర్జీవీ మాత్రం ‘ఎనిమీషిప్ డే’ జరుపుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు స్నేహితుడి కంటే శత్రువే బెటర్ అని.. ఫ్రెండ్‌ను నమ్ముకుంటే నట్టేట మునగాల్సిందేనని వరుస ట్వీట్స్ చేశాడు. దోస్తుల మాదిరిగా శత్రువులు మిత్రద్రోహం చేయలేరన్న వర్మ.. శత్రువులు మనల్ని ధైర్యంగా ఫేస్ చేస్తే, ఫ్రెండ్స్ మాత్రం వెన్నుపోటు పొడుస్తారని వివరించాడు.

ఎనిమీస్ మన బలాన్ని సీరియస్‌గా తీసుకుంటే, స్నేహితులు మాత్రం కాన్ఫిడెన్స్ లూజ్ చేయడంలో ముందుంటారని చెప్పాడు. మరో విషయం ఏంటంటే స్నేహితులకు హెల్ప్ చేస్తే మళ్లీ సాయం కోసం వస్తారని, అందుకే దూరంగా ఉండటమే మంచిదని సలహాలు ఇచ్చాడు వర్మ. దీనిపై నెటిజన్ల నుంచి అనేక రకాల కామెంట్స్ వచ్చినా.. వర్మ ఆలోచన గొప్పగా ఉందన్నవారే ఎక్కువ.

Tags:    

Similar News