ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్‌లోకి నదాల్
దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్ 2021లో హాట్ ఫేవరెట్‌గా భావిస్తున్న స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నదాల్ మంగళవారం రోలాండ్ గారోస్ మెయిన్ కోర్టులో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్సీ పోపిరిన్‌పై 6-3, 6-2, 7-6 (7-3) తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్‌లో నదాల్‌ను కాస్త ఇబ్బంది పెట్టిన పోపిరిన్ రెండో సెట్లో చేతులెత్తేశాడు. కానీ మూడో సెట్లో డిఫెండింగ్ చాంపియన్ నదాల్‌కు […]
దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్ 2021లో హాట్ ఫేవరెట్‌గా భావిస్తున్న స్పెయిన్ బుల్ రఫెల్ నదాల్ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన నదాల్ మంగళవారం రోలాండ్ గారోస్ మెయిన్ కోర్టులో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్సీ పోపిరిన్‌పై 6-3, 6-2, 7-6 (7-3) తేడాతో విజయం సాధించాడు. తొలి సెట్‌లో నదాల్‌ను కాస్త ఇబ్బంది పెట్టిన పోపిరిన్ రెండో సెట్లో చేతులెత్తేశాడు. కానీ మూడో సెట్లో డిఫెండింగ్ చాంపియన్ నదాల్‌కు చుక్కలు చూపించాడు. ఒకానొక దశలో సెట్ నదాల్ 3-5తో వెనుకబడ్డాడు. ఈ క్రమంలో సెట్ పాయింట్ వరకు వెళ్లిన పోపిరిన్‌ను నదాల్ తన అనుభవంతో అడ్డుకున్నాడు. మూడో సెట్ టై బ్రేకర్ ద్వారా నదాల్ గెలుచుకొని రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఇక 7వ సీడ్ ఆండ్రీ రుబ్లేవ్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. అన్ సీడెడ్ ఆటగాడు జన్-లెన్నార్డ్ స్టర్ఫ్‌పై 3-6, 6-7 (6-8), 6-4, 6-3, 4-6 తేడాతో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత రూబ్లేవ్ వరుసగా మూడు, నాలుగు సెట్లు గెలుచుకొని మ్యాచ్‌లోకి వచ్చాడు. కానీ చివరి సెట్ కోల్పోయి పరాజయం పాలయ్యాడు. ఇక 10వ సీడ్ ష్క్వార్జ్‌మాన్ 6-2, 6-2, 6-3 తేడాతో యున్ షన్‌పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు.
వరల్డ్ నెంబర్ 2 క్రీడాకారిణి నయోమీ ఒసాక ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తొలి రౌండ్‌లో పాట్రిషియా మారియా టిగ్‌పై 6-4, 7-6 (7-4) తేడాతో విజయం సాధించిన ఒసాక.. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడలేదు. దీంతో ఆమెకు రిఫరీ 15 వేల డాలర్ల జరిమానా విధించారు. ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులతో పాటు వింబుల్డన్, అమెరికా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు కూడా మీడియా సమావేశాల్లో ఒసాకా పాల్గొనకపోతే భవిష్యత్‌లో భారీ జరిమానాలతో పాటు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేశారు. తర్వాతి మ్యాచ్‌లలో మీడియా సమావేశాల్లో మాట్లాడకపోతే బహిష్కరిస్తామని కూడా పేర్కొన్నారు. కాగా, ఫ్రెంచ్ఓపెన్‌కు ముందే మీడియా సమావేశాల్లో పాల్గొనేది లేదని చెప్పిన ఒసాకా.. తాజాగా మొత్తం టోర్నీ నుంచే వైదొలగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. తనకు మానసిక ఆరోగ్యం సరిగా లేదని, మీడియా సమావేశాల్లో పాల్గొనలేనందునే టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు చెప్పింది.