అక్రమ నిర్మాణాలకు అండగా కేటీఆర్ ? రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి అండతోనే ఉప్పల్ చౌరస్తాలో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలుంటాయా? లేక దీనిలో మీకూ భాగస్వామ్యముందా అని మంత్రి […]
దిశ, డైనమిక్ బ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి అండతోనే ఉప్పల్ చౌరస్తాలో అనుమతి లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారంటూ ట్వీట్ చేశారు. దీనిపై ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలుంటాయా? లేక దీనిలో మీకూ భాగస్వామ్యముందా అని మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ విమర్శించారు. దీనిపై స్పందించాలంటూ.. తెలంగాణ సీఎంవో, జీహెచ్ఎంసీ కమిషనర్ ను ట్యాగ్ చేశారు.
హైదరాబాద్ మంత్రి అండ…
ఉప్పల్ చౌరస్తాలో…
అనుమతి లేని అక్రమ నిర్మాణం…
ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు…@ktrtrs మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..?
లేదా మీరూ భాగస్వాములేనా…!?@telanganaCMO@CommissionrGHMC pic.twitter.com/zUoiZmQXbE— Revanth Reddy (@revanth_anumula) October 18, 2021