సీఎం దత్తత గ్రామంలో రైతులతో భేటీకి సిద్ధమైన రేవంత్ రెడ్డి
దిశ,మర్కుక్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దత్తత గ్రామమైన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. రైతు సమస్యలపై నేరుగా వారితో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 27న సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు […]
దిశ,మర్కుక్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దత్తత గ్రామమైన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. రైతు సమస్యలపై నేరుగా వారితో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 27న సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ రచ్చబండ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు, కిసాన్ సెల్ నాయకులు పాల్గొననున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.