ప్రభుత్వానికి సహకరించాలి
దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. హన్మకొండ ఆర్‌అండ్‌బీ శాఖ విశ్రాంతి భవనంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ ఫమేలా సత్పతి, కార్పోరేటర్లు రంజిత్ రావు, చాడ స్వాతి లతో వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పరిస్థితుల పై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ కరోనా […]
దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. హన్మకొండ ఆర్‌అండ్‌బీ శాఖ విశ్రాంతి భవనంలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ ఫమేలా సత్పతి, కార్పోరేటర్లు రంజిత్ రావు, చాడ స్వాతి లతో వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పరిస్థితుల పై సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విదేశాల నుండి వచ్చిన వారిలో కరోనా లేదని, మర్కజ్ ప్రార్ధనలకు వెళ్లిన వారితో కొంత మేరకు వైరస్ వ్యాప్తి చెందినట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Tags: Warangal,Minister Errabelli,Review meeting