వెనక్కి పారిన జలపాతం!
వర్షాలు పడుతుంటే పొంగుతున్న జలపాతాలను చూడటంలో కలిగే మజానే వేరు. చిన్న జలపాతాలను చూస్తుంటేనే ఉరకలేసే ఉత్సాహం.. ఇక పెద్ద జలపాతాలను చూస్తే ఆకాశాన్ని అంటుతుంది. కానీ ఆస్ట్రేలియాలోని రాయల్ నేషనల్ పార్కులో ఆవిష్కృతమైన ఓ ప్రకృతి వింతను చూస్తే ఇక గాల్లో లేస్తారేమో.. ఇంతకీ అక్కడ ఆవిష్కృతమైన వింత ఏంటంటే.. ప్రస్తుతం మన దగ్గర కురుస్తున్నట్లే గత వారం ఆస్ట్రేలియా అంతటా భారీ వర్షాలు కురిశాయి. అయితే అక్కడ వర్షాలతో పాటు విపరీతమైన గాలులు కూడా […]
వర్షాలు పడుతుంటే పొంగుతున్న జలపాతాలను చూడటంలో కలిగే మజానే వేరు. చిన్న జలపాతాలను చూస్తుంటేనే ఉరకలేసే ఉత్సాహం.. ఇక పెద్ద జలపాతాలను చూస్తే ఆకాశాన్ని అంటుతుంది. కానీ ఆస్ట్రేలియాలోని రాయల్ నేషనల్ పార్కులో ఆవిష్కృతమైన ఓ ప్రకృతి వింతను చూస్తే ఇక గాల్లో లేస్తారేమో.. ఇంతకీ అక్కడ ఆవిష్కృతమైన వింత ఏంటంటే..
ప్రస్తుతం మన దగ్గర కురుస్తున్నట్లే గత వారం ఆస్ట్రేలియా అంతటా భారీ వర్షాలు కురిశాయి. అయితే అక్కడ వర్షాలతో పాటు విపరీతమైన గాలులు కూడా వీస్తాయి. ఆ గాలుల ధాటికి రాయల్ నేషనల్ పార్కులో ఉన్న జలపాతం వెనక్కి పారింది. దాదాపు గంటకు 70 కి.మీ.ల వేగంతో వీచిన గాలులు జలపాతం నీటిని కిందకు పడకుండా పైకి లేచేలా చేశాయి. పార్కులోని బుదీనా స్పాట్ నుంచి కనిపించిన ఈ దృశ్యాన్ని పార్కు సిబ్బంది రికార్డు చేశారు. దాన్ని వారి ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. కాగా, ఆ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. అలాంటి దృశ్యాన్ని ఒక్కసారైనా ప్రత్యక్షంగా చూడగలిగితే బాగుండునని అనుకుంటున్నారు.