కరోనా నివారణకు రెవెన్యూ ఉద్యోగుల ప్రచారం
దిశ, నిజామాబాద్: తెలంగాణ ప్రజలు ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రెవెన్యూ ఉద్యోగులు నడుం బిగించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు వైరస్ సోకకుండా ఉండేందుకు అందరికి అవగాహన కల్పిస్తున్నారు. మండల స్థాయిలోని వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ శాఖ ఉద్యోగులను అనుసంధానం చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం కూడా తమ వంతు బాధ్యతగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు మాస్కులు అందజేశారు. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు శానిటైజర్ వినియోగించాలని […]
దిశ, నిజామాబాద్:
తెలంగాణ ప్రజలు ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రెవెన్యూ ఉద్యోగులు నడుం బిగించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు వైరస్ సోకకుండా ఉండేందుకు అందరికి అవగాహన కల్పిస్తున్నారు. మండల స్థాయిలోని వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీ శాఖ ఉద్యోగులను అనుసంధానం చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం కూడా తమ వంతు బాధ్యతగా హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు మాస్కులు అందజేశారు. ప్రతి విద్యార్థిని, విద్యార్థులు శానిటైజర్ వినియోగించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని విజయ్ హైస్కూల్, ముబారక్ నగర్‌లోని ప్రభుత్వ స్కూల్లో ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు. ఈనెల 22 ఆదివారం నాడు ప్రధాని మోడీ పిలుపు మేరకు అందరూ ఇంటికి పరిమితమై వైరస్ నుంచి తమను తాము, దేశాన్ని రక్షించాలని విద్యార్థులకు తెలిపారు. అనంతరం కొన్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసి, జనతా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటయ్య, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ తహశీల్దార్ ప్రశాంత్ కుమార్, ఇతర రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
tags ; coronavirus, revenue employees, precautions to students and passenger, nizamabad