రేవంత్‌రెడ్డి పిల్‌పై హైకోర్టులో విచారణ
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులు కేంద్ర సంస్థలకు అప్పగించాలన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పిల్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులను దర్యాప్తు చేసే అధికారం తమకూ ఉందని తెలిపిన ఎక్సైజ్ శాఖ.. 2017లో నమోదైన 12 డ్రగ్స్ కేసుల దర్యాప్తు పూర్తి అయ్యిందని, కేంద్ర సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అటు.. ఎక్సైజ్ శాఖ తమకు డ్రగ్స్ కేసు వివరాలను ఇవ్వడం లేదని ఈడీ తెలిపింది. దీంతో డ్రగ్స్ కేసు విచారణను […]
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసులు కేంద్ర సంస్థలకు అప్పగించాలన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి పిల్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులను దర్యాప్తు చేసే అధికారం తమకూ ఉందని తెలిపిన ఎక్సైజ్ శాఖ.. 2017లో నమోదైన 12 డ్రగ్స్ కేసుల దర్యాప్తు పూర్తి అయ్యిందని, కేంద్ర సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అటు.. ఎక్సైజ్ శాఖ తమకు డ్రగ్స్ కేసు వివరాలను ఇవ్వడం లేదని ఈడీ తెలిపింది. దీంతో డ్రగ్స్ కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.