ప్రజాప్రతినిధులంటే లెక్కలేదా..? రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: ప్రజాప్రతినిధులు అంటే మీకు లెక్కలేదా..? మేము బాధితుల లిస్ట్ ఇచ్చినా వారికి పరిహారం ఇవ్వరా..? అనర్హులకు పంచి.. అర్హులకు నష్టపరిహారం ఇవ్వరా..? నేను వస్తున్నా అని చెప్పినా అధికారులు అందుబాటులో ఉండరా..? ఇదేం పాలనా..? అని జీహెచ్ఎంసీ అధికారులపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించడంతో అధికారులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. వేలమంది నష్టపోతే కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే పరిహారం అందించి మిగతా వారికి ఎందుకు […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రజాప్రతినిధులు అంటే మీకు లెక్కలేదా..? మేము బాధితుల లిస్ట్ ఇచ్చినా వారికి పరిహారం ఇవ్వరా..? అనర్హులకు పంచి.. అర్హులకు నష్టపరిహారం ఇవ్వరా..? నేను వస్తున్నా అని చెప్పినా అధికారులు అందుబాటులో ఉండరా..? ఇదేం పాలనా..? అని జీహెచ్ఎంసీ అధికారులపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించడంతో అధికారులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. వేలమంది నష్టపోతే కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే పరిహారం అందించి మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌తో కలిసి మల్కాజిగిరి మునిసిపల్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వరద బాధితుల వివరాలను అందించారు. వరద నష్ట పరిహారం పంపిణీలో టీఆర్ఎస్ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకొని, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినా అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలోనే ధర్నాకు దిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.