కేసీఆర్ ఫాంహౌస్‌లో డబ్బులు పంచుతున్నారు !
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామానికి ఇద్దరిని పిలిచి కేసీఆర్ ఫౌంహౌస్‌లో డబ్బులు పంచుతున్నారని, అక్కడ ఎందుకు సోదాలు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకలో పోలీసుల సోదాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి… డబ్బులు ఉంటే ఆదాయ పన్నుశాఖ తనిఖీలు చేయాలని.. కానీ పోలీసులకు సోదాలు చేసే అధికారం లేదన్నారు. బీజేపీలో కేసీఆర్‌కు అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయన్న రేవంత్… బండి సంజయ్‌ను […]
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రామానికి ఇద్దరిని పిలిచి కేసీఆర్ ఫౌంహౌస్‌లో డబ్బులు పంచుతున్నారని, అక్కడ ఎందుకు సోదాలు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకలో పోలీసుల సోదాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి… డబ్బులు ఉంటే ఆదాయ పన్నుశాఖ తనిఖీలు చేయాలని.. కానీ పోలీసులకు సోదాలు చేసే అధికారం లేదన్నారు. బీజేపీలో కేసీఆర్‌కు అనుకూల, వ్యతిరేక వర్గాలున్నాయన్న రేవంత్… బండి సంజయ్‌ను మురళీధర్‌రావు, విద్యాసాగర్‌రావు ఎందుకు పరామర్శించలేదన్నారు. కలెక్టర్ సీపీని పిలిచి సమీక్షించే అధికారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఉన్నా.. ఆ పని ఎందుకు చేయలేదన్నారు. అసలు టీఆర్ఎస్‌తో కిషన్‌రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటని ప్రశ్నించారు.