రేవంత్ రెడ్డివి అన్నీ తప్పుడు ఆరోపణలే : తెలంగాణ డీజీపీ

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పోలీస్ శాఖ రెండుగా చీలిపోయిందని, పోలీసులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం డీజీపీ కార్యాలయం స్పందించింది. పోలీసు శాఖపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ కార్యాలయం ఖండించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు రేవంత్ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారణమైనవని తెలిపింది. ఇవి పోలీస్ వ్యవస్థ పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఉన్నతాధికారుల మధ్య విబేధాలు […]

Update: 2021-10-25 10:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని పోలీస్ శాఖ రెండుగా చీలిపోయిందని, పోలీసులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం డీజీపీ కార్యాలయం స్పందించింది. పోలీసు శాఖపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ కార్యాలయం ఖండించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు రేవంత్ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారణమైనవని తెలిపింది. ఇవి పోలీస్ వ్యవస్థ పరువుకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ఉన్నతాధికారుల మధ్య విబేధాలు ఏమీ లేవని, పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ప్రకటించింది. రాష్ట్రంలోని శాంతిభద్రతలు కాపాడటం కోసం పోలీస్ శాఖ రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోందని వెల్లడించింది.

Tags:    

Similar News