ఏపీ 203 జీవో ప్రగతిభవన్‌లో తయారైందా !
దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో దొంగ, దొర పాత్రలూ కేసీఆర్‌వేనని తీవ్ర విమర్శలు చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు మే 5వ తేదీన మొదలు కాలేదని, 2019 ఆగస్టులో కేసీఆర్ రాయలసీమకు వెళ్లి రాగిసంకటి తిన్నప్పుడే పురుడు పోసుకుందన్నారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని ఆ సమయంలోనే ఏపీ కేబినెట్‌లో చర్చరించారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో దొంగ […]
దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో దొంగ, దొర పాత్రలూ కేసీఆర్‌వేనని తీవ్ర విమర్శలు చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు మే 5వ తేదీన మొదలు కాలేదని, 2019 ఆగస్టులో కేసీఆర్ రాయలసీమకు వెళ్లి రాగిసంకటి తిన్నప్పుడే పురుడు పోసుకుందన్నారు. పోతిరెడ్డిపాడు అంశాన్ని ఆ సమయంలోనే ఏపీ కేబినెట్‌లో చర్చరించారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో దొంగ ఒప్పందాలు ఉండటంతోనే కేటీఆర్, హరీశ్‌రావులు మాట్లాడటం మండిపడ్డారు. ఏపీ జారీ చేసిన 203 జీవో ప్రగతిభవన్‌లోనే తయారైందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు జలదోపిడీపై ప్రధాని మోడీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి కాంగ్రెస్ పార్టీ లేఖలు రాస్తుందని, ఏపీ నీళ్ల దోపిడీని అడ్డుకుంటుందన్నారు. గురువారం బీఆర్‌కే భవన్‌లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ను కలిసిన అనంతరం రేవంత్ ఈ వ్యాఖ్యలు మాట్లాడారు.