మంత్రిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదు
దిశ, దుబ్బాక: మంత్రి హరీష్ రావును విమర్శించే స్ధాయి ఎంపీ రేవంత్ రెడ్డికి లేదన్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్లు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాల మల్లేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు. ఈ […]
దిశ, దుబ్బాక: మంత్రి హరీష్ రావును విమర్శించే స్ధాయి ఎంపీ రేవంత్ రెడ్డికి లేదన్నారు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో కార్యకర్తలతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్లు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బాల మల్లేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి స్థాయిని మరిచి అహంకారపూరిత ధోరణితో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓటమి భారంతో తలదించుకొని నియోజకవర్గం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డికి వస్తోందన్నారు.