రాయిటర్స్ అబద్దాలు రాస్తుందా?.. మీడియాలో తీవ్ర చర్చ

        అంతర్జాతీయ మీడియాలో రాయిటర్స్‌కి ప్రముఖ స్థానముంది. 1850 నుంచి మీడియా సేవలందిస్తున్న రాయిటర్స్ కథనాలకు మంచి పేరుండేది. జర్మనీలోని బెర్లిన్ వేదికగా పురుడు పోసుకున్న రాయిటర్స్ సంస్థ 1951లో లండన్‌లోని రాయల్ ఎక్సేంజ్ కేంద్రంగా సేవలు ఆరంభించింది. అప్పటి నుంచి ఆసక్తికరమైన కథనాలతో జనాల్లోకి వెళ్లింది. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో ప్రముఖమైన సంస్థల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. దీంతో ఇది తన పరిధిని విస్తరించుకుని వివిధ దేశాలకు వెళ్లింది. ఈ క్రమంలోనే భారత్‌కు […]

Update: 2020-02-09 23:18 GMT

అంతర్జాతీయ మీడియాలో రాయిటర్స్‌కి ప్రముఖ స్థానముంది. 1850 నుంచి మీడియా సేవలందిస్తున్న రాయిటర్స్ కథనాలకు మంచి పేరుండేది. జర్మనీలోని బెర్లిన్ వేదికగా పురుడు పోసుకున్న రాయిటర్స్ సంస్థ 1951లో లండన్‌లోని రాయల్ ఎక్సేంజ్ కేంద్రంగా సేవలు ఆరంభించింది. అప్పటి నుంచి ఆసక్తికరమైన కథనాలతో జనాల్లోకి వెళ్లింది. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో ప్రముఖమైన సంస్థల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. దీంతో ఇది తన పరిధిని విస్తరించుకుని వివిధ దేశాలకు వెళ్లింది. ఈ క్రమంలోనే భారత్‌కు కూడా వచ్చింది.

అంతర్జాతీయ మీడియాలో విశ్వసనీయతతో కూడిన కథనాలు ప్రచురిస్తారన్న అపప్రధను రాయిటర్స్ తుడిచిపెట్టేసింది. భారతదేశంలో మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా పని చేస్తాయన్న ఆరోపణలను నిజం చేస్తూ రాయిటర్స్ కియా కథనం వండి వార్చిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతోందంటూ రాయిటర్స్ లో వచ్చిన కథనం ఏపీతో పాటు జాతీయ స్థాయిలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న తరుణంలో ఆ కథనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే కియా మోటార్స్ స్పందిస్తూ, తాము ఏపీ నుంచి వెళ్లిపోతున్నామన్నది కట్టుకథ అని, తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నది అవాస్తవం అని స్పష్టం చేయడంతో కథ అడ్డం తిరిగింది. అటు, తమిళనాడు ప్రభుత్వ వర్గాలు కూడా కియా గురించి తమకేమీ సమాచారం లేదని తేల్చిచెప్పడంతో రాయిటర్స్ కథనం విశ్వసనీయతపై సందేహాలు బయల్దేరాయి.

ఈ నేపథ్యంలో, కియా మోటార్స్‌పై తాము రాసిన కథనాన్ని తొలగిస్తున్నామని రాయిటర్స్ ఇండియా ట్విట్టర్‌లో వెల్లడించింది. వంద కోట్ల డాలర్ల విలువైన ప్లాంట్‌ను ఏపీ నుంచి తరలించేందుకు కియా చర్చలు జరుపుతోంది అనే కథనం తాలూకు అవాస్తవిక ట్వీట్‌ను తొలగిస్తున్నామని స్పష్టం చేసింది. తొలగించింది కూడాను.

తీవ్ర చర్చను లేవదీసిన రాయిటర్స్ కథనంపై జరిగిన చర్చ ఇప్పుడు రాయిటర్స్ విశ్వసనీయతపై జరుగుతోంది. మన దేశంలో మీడియా సంస్థలు రాజకీయపార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరిస్తాయన్న సంగతి తెలిసిందే. కేటాయింపులు, కాంట్రాక్టులు, తాయిలాలు, యాడ్ల ద్వారా సంపాదన కోసం మీడియా సంస్థలు అవినీతికి పాల్పడతాయన్న ఆరోపణలున్నాయి.

కియా మోటార్స్ గతంలో అమెరికా ట్విన్ టవర్స్ కూల్చి వేత సందర్భంగా ప్రచురించిన కథనం కూడా వివాదాస్పదమైంది. టెర్రరిస్టుల గురించిన సమాచారంపై సరైన అవగాహన లేకుండా, సరైన ఆధారాలు లేకుండా కథనాన్ని ప్రచురించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాత ప్రచురించిన కొన్ని కథనాలు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు ఏపీలో కియా పరిశ్రమ గురించిన కథనం కూడా పాఠకులను అయోమయంలోకి నెట్టింది. అంతేకాకుండా రాయిటర్స్ కథనాల విశ్వసనీయతపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది.

Tags:    

Similar News