కడసారి చూపునకు నోచుకోలేదు

దిశ, రంగారెడ్డి: కరోనా ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ వైరస్ చేస్తున్న పని అంతా ఇంతా కాదు. 50 ఏళ్లు కలిసి జీవించిన భర్త చనిపోతే.. తన భార్యకు కడసారి చూపునకు నోచుకోకుండా చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు జిట్టా మాధవరెడ్డి మూడు రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో అమెరికాలో ఉన్న ఓ కుమార్తె వద్దకు మాధవరెడ్డి భార్య వెళ్లింది. కరోనా నేపథ్యంలో […]

Update: 2020-05-24 07:21 GMT

దిశ, రంగారెడ్డి: కరోనా ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ వైరస్ చేస్తున్న పని అంతా ఇంతా కాదు. 50 ఏళ్లు కలిసి జీవించిన భర్త చనిపోతే.. తన భార్యకు కడసారి చూపునకు నోచుకోకుండా చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు జిట్టా మాధవరెడ్డి మూడు రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారిలో అమెరికాలో ఉన్న ఓ కుమార్తె వద్దకు మాధవరెడ్డి భార్య వెళ్లింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. ఈక్రమంలో మాధవరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఆయన భార్య కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోయింది. దీంతో ఆదివారం మాధవ రెడ్డి అంత్యక్రియలను పూర్తి చేశారు.

Tags:    

Similar News