సీఎంఆర్ఎఫ్‌కు రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల విరాళం
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణ చర్యల్లో ప్రభుత్వానికి అండగా ఉండాలన్న ఆలోచనతో సీఎం సహాయ నిధికి తెలంగాణ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ రూ. 8.50లక్షల విరాళాన్ని అందించింది. శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో ఆర్థికమంత్రి హరీశ్‌రావును కలిసిన తెలంగాణ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు చెక్కులను అందజేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో తాము భాగస్వాములు కావాలన్న ఆలోచనతోనే ఒక రోజు పెన్షన్‌ను విరాళంగా ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమాఖ్యలోని ఆంధ్రా బ్యాంకు రిటైర్డ్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా నియంత్రణ చర్యల్లో ప్రభుత్వానికి అండగా ఉండాలన్న ఆలోచనతో సీఎం సహాయ నిధికి తెలంగాణ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ రూ. 8.50లక్షల విరాళాన్ని అందించింది. శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో ఆర్థికమంత్రి హరీశ్‌రావును కలిసిన తెలంగాణ బ్యాంక్ రిటైర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు చెక్కులను అందజేశారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో తాము భాగస్వాములు కావాలన్న ఆలోచనతోనే ఒక రోజు పెన్షన్‌ను విరాళంగా ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమాఖ్యలోని ఆంధ్రా బ్యాంకు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోషియేషన్ 4 లక్షల 20 వేల రూపాయల చెక్కును, తెలంగాణ బ్యాంకు రిటైర్ ఫెడరేషన్ 3 లక్షల 10 వేల రూపాయల చెక్కును, ఐ.ఎన్.జి వైశ్యా బ్యాంకు పెన్షనర్స్ వెల్ఫెర్ అసోషియేషన్ రూ. లక్షా 20 వేల చెక్ ను మంత్రి హరీశ్ రావుకు అందజేశారు. ప్రభుత్వంతో చేయి చేయి కలిపి కరోనాపై పోరాటానికి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు ముందుకు రావడం హర్షనీయమని మంత్రి హరీశ్‌రావు అభినందించారు.