పెరిగిన పారిశ్రామికోత్పత్తి.. దిగొచ్చిన ద్రవ్యోల్బణం

దిశ, వెబ్‌డెస్క్: మహమ్మారి పరిస్థితుల నుంచి పారిశ్రామిక రంగం కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తోంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతంతో ఐదు నెలల కనిష్ఠానికి తగ్గినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) మంగళవారం ప్రకటించింది. సమీక్షించిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) స్వల్పంగా తగ్గింది. ఆహార పదార్థాల ధరలు దిగి రావడంతోనే ద్రవ్యోల్బణంగా సానుకూలంగా ఉంది. అంతకుముందు ఆగష్టులో సీపీఐ ద్రవ్యోల్బణం 5.30 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇక, సమీక్షించిన నెలలో ఆహార […]

Update: 2021-10-12 11:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహమ్మారి పరిస్థితుల నుంచి పారిశ్రామిక రంగం కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తోంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతంతో ఐదు నెలల కనిష్ఠానికి తగ్గినట్టు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్ఎస్ఓ) మంగళవారం ప్రకటించింది. సమీక్షించిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) స్వల్పంగా తగ్గింది. ఆహార పదార్థాల ధరలు దిగి రావడంతోనే ద్రవ్యోల్బణంగా సానుకూలంగా ఉంది. అంతకుముందు ఆగష్టులో సీపీఐ ద్రవ్యోల్బణం 5.30 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ఇక, సమీక్షించిన నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 0.68 శాత్నగా ఉంది.

ఇంధన ద్రవ్యోల్బణం 13.63 శాతం నుంచి 12.94 శాతానికి తగ్గింది. నూనెల ధరలు మాత్రం 33 శాతం నుంచి 34.19 శాతానికి పెరిగింది. ఇక, ఆగష్టు నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి 11.9 శాతానికి పెరిగింది. ముఖ్యంగా తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాల్లో ఉత్పత్తి మెరుగ్గా ఉండటంతో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) సానుకూలంగా ఉందని ఎన్ఎస్ఓ తెలిపింది. గతేడాది ఇదే నెలలో ఐఐపీ సూచీ 7.1 శాతంగా నమోదైంది. సమీక్షించిన నెలలో తయారీ రంగంలో ఉత్పత్తి 9.7 శాతం, మైనింగ్ 23.6 శాతం, విద్యుత్ ఉత్పత్తి 16 శాతం పెరిగింది.

Tags:    

Similar News