ఫార్వర్డ్ మెసేజ్‌ల పరిధి తగ్గించిన వాట్సాప్

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 గురించి తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా వాట్సాప్ మరో షరతును అమలు చేసింది. ఎక్కువగా ఫార్వర్డ్ అయిన మెసేజ్‌లను ఒకసారి ఒకరికి మాత్రమే ఫార్వర్డ్ చేయగలిగే పరిధి విధించింది. అంతేకాకుండా యూజర్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌ను వెరిఫై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఇప్పటివరకు గరిష్టంగా ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్ మెసేజ్‌లను పంపించే అవకాశం కల్పించేది. తప్పుడు సమాచారం దావానలంలా వ్యాపించి సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ […]

Update: 2020-04-07 04:13 GMT

దిశ, వెబ్‌డెస్క్:
కొవిడ్ 19 గురించి తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా వాట్సాప్ మరో షరతును అమలు చేసింది. ఎక్కువగా ఫార్వర్డ్ అయిన మెసేజ్‌లను ఒకసారి ఒకరికి మాత్రమే ఫార్వర్డ్ చేయగలిగే పరిధి విధించింది. అంతేకాకుండా యూజర్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్‌ను వెరిఫై చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది.

ఇప్పటివరకు గరిష్టంగా ఐదుగురికి మాత్రమే ఫార్వర్డ్ మెసేజ్‌లను పంపించే అవకాశం కల్పించేది. తప్పుడు సమాచారం దావానలంలా వ్యాపించి సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ షరతు అమల్లోకి వచ్చాక ఫార్వర్డ్ మెసేజ్‌లు 25 శాతం తగ్గినట్లు వాట్సాప్ తెలిపింది. ఇక ఫార్వర్డ్ మెసేజ్‌ను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి వెరిఫై చేయగల అవకాశాన్ని ప్రస్తుతానికి బీటా వెర్షన్లలో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది.

Tags: Whatsapp, Corona, Covid, forward messages, limit, beta version

Tags:    

Similar News