45 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి
దిశ, తెలంగాణ బ్యూరో: 2018 మే 16న సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నాలుగున్నర గంటలపాటు సమావేశం నిర్వహించి 18 సమస్యలపై చర్చించారు. 13 సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం నిర్ణయాలను తానే స్వయంగా మీడియా సమావేశంలో ప్రకటించారు. నేటి వరకు ఐఆర్ ప్రకటించలేదు. మూడు నెలలు అన్న పీఆర్సీ నివేదిక కాలపరిమితిని 30 నెలలకు పొడిగించారు. ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. తక్షణమే రిపోర్టును బహిర్గతం చేసి సంఘాలతో చర్చించి 45% […]
దిశ, తెలంగాణ బ్యూరో: 2018 మే 16న సీఎం కేసీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో నాలుగున్నర గంటలపాటు సమావేశం నిర్వహించి 18 సమస్యలపై చర్చించారు. 13 సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం నిర్ణయాలను తానే స్వయంగా మీడియా సమావేశంలో ప్రకటించారు. నేటి వరకు ఐఆర్ ప్రకటించలేదు. మూడు నెలలు అన్న పీఆర్సీ నివేదిక కాలపరిమితిని 30 నెలలకు పొడిగించారు. ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. తక్షణమే రిపోర్టును బహిర్గతం చేసి సంఘాలతో చర్చించి 45% ఫిట్‌మెంట్‌తో 2018 జూలై నుంచి కొత్త పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాల్గో మహాసభ డిమాండ్ చేసింది.
ఆదివారం హైదరాబాద్ లో సంఘాల మహాసభ జరిగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వటానికి వెంటనే షెడ్యూల్ ప్రకటించాలని సభ తీర్మానించింది. స్పెషల్ టీచర్ల సర్వీసుకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాలుగవ మహాసభలు మూడవ రోజు(చివరి రోజు) సమావేశంలో సామాజిక, విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలపై పలు తీర్మానాలను టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆఫీసు బేరర్లు తీర్మానాలను ప్రతిపాదించగా సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
సభలో సామాజిక తీర్మానాలు
కోవిడ్-19 వైరస్ నిరోధక వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ ఉచితంగా సకాలములో సరఫరా చేయుటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. మహిళలు, బాలికలపై అత్యాచారాలను అరికట్టాలి. కోవిడ్-19 కారణంగా లాక్‌డౌన్ కాలంలో ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కోట్లాది మంది కార్మికులు, అడ్డా వ్యాపారులు ఉపాధిని కోల్పోయారు.
విద్యారంగ తీర్మానాలు
జాతీయ విద్యావిధానం – 2020ను సమూలంగా సవరించాలి. రాజ్యాంగ విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, సైంటిఫిక్ టెంపర్ వంటి అంశాలకు చోటు కల్పించక పోగా కేంద్రీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, కాషాయీ కరణలకు దారులు తెరుస్తున్న తిరోగామి జాతీయ విద్యావిధానం – 2020 ను సమూలంగా సవరించాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. పాఠశాలలకు స్వీపర్, అటెండర్, వాచ్‌మెన్, క్లరికల్ పోస్టులను మంజూరు చేయాలి. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పాఠశాలలు వెంటనే ప్రారంభించాలి.