యాచారం ఎంఈఓను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌కు రిక్వెస్ట్
దిశ, యాచారం: యాచారం మండలం ఎంఈఓ రామానుజన్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని రంగారెడ్డి జిల్లా బహుజన టీచర్స్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు బుధవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. నవంబర్ 29న మేడిపల్లి పాఠశాలను సందర్శించిన ఎంఈఓ ఆ పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులతో సమావేశం జరుగుతున్న సందర్భంలో చాలా అవమానకరమైన, అనుచితమైన, కుల ఆధిపత్య ధోరణితో ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అగౌరపరిచే విధంగా మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు. రామానుజన్ రెడ్డి గతంలో […]
దిశ, యాచారం: యాచారం మండలం ఎంఈఓ రామానుజన్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని రంగారెడ్డి జిల్లా బహుజన టీచర్స్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు బుధవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. నవంబర్ 29న మేడిపల్లి పాఠశాలను సందర్శించిన ఎంఈఓ ఆ పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులతో సమావేశం జరుగుతున్న సందర్భంలో చాలా అవమానకరమైన, అనుచితమైన, కుల ఆధిపత్య ధోరణితో ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అగౌరపరిచే విధంగా మాట్లాడారని లేఖలో పేర్కొన్నారు.
రామానుజన్ రెడ్డి గతంలో కూడా విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతోపాటుగా అనేక విధాలుగా ఉపాధ్యాయులను, సీఆర్పీలను ఇబ్బందులకు గురి చేశారని.. దీంతో గతంలో రామానుజన్ రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అయినా కూడా ఆయన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదని, రామానుజన్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. యాదగిరి, బీటీఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరకుడు దామోదర్, జిల్లా కార్యదర్శి సాయప్ప తదితరులు పాల్గొన్నారు.