రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్టు
న్యూఢిల్లీ: ఫేక్ టీఆర్‌పీ కేసులో రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాంచందానిని ముంబయి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముంబయి కోర్టు వికాస్‌ను ఈ నెల 15 వరకు పోలీసు రిమాండ్‌కు పంపించింది. ఈ కేసులో అరెస్టైన వారిలో వికాస్ 13వ వ్యక్తి. టీఆర్‌పీ స్కామ్ గురించి వికాస్‌కు తెలుసని, ఈ సంక్షోభంతో లబ్ది చెందేది వికాసేనని ముంబయి పోలీసులు తెలిపారు. వ్యూయర్‌షిప్ సంఖ్యను ఎక్కువగా చూపెట్టే స్కామ్ కేసులో రిపబ్లిక్ టీవీతోపాటు, ఫక్త్ మరాఠీ, బాక్స్ […]
న్యూఢిల్లీ: ఫేక్ టీఆర్‌పీ కేసులో రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాంచందానిని ముంబయి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముంబయి కోర్టు వికాస్‌ను ఈ నెల 15 వరకు పోలీసు రిమాండ్‌కు పంపించింది. ఈ కేసులో అరెస్టైన వారిలో వికాస్ 13వ వ్యక్తి. టీఆర్‌పీ స్కామ్ గురించి వికాస్‌కు తెలుసని, ఈ సంక్షోభంతో లబ్ది చెందేది వికాసేనని ముంబయి పోలీసులు తెలిపారు. వ్యూయర్‌షిప్ సంఖ్యను ఎక్కువగా చూపెట్టే స్కామ్ కేసులో రిపబ్లిక్ టీవీతోపాటు, ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా, న్యూస్ నేషన్, మహా మూవీస్, వావ్ మ్యూజిక్ చానెళ్లపై ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.