ఆయన లేకుండానే గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీ: విదేశీ అతిథి లేకుండానే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సారి జనవరి 26న విదేశీ అతిథి లేకుండానే గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇప్పటి వరకు 1952, 1953, 1966లలో విదేశీ అతిథి లేకుండా ఈ వేడుకలు జరిగాయి. ఈ సారి వేడుకల్లో కరోనా కారణంగా చాలా మార్పులు జరిగాయి. స్వతంత్ర భారత చరిత్రలో […]
న్యూఢిల్లీ: విదేశీ అతిథి లేకుండానే ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సారి జనవరి 26న విదేశీ అతిథి లేకుండానే గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇప్పటి వరకు 1952, 1953, 1966లలో విదేశీ అతిథి లేకుండా ఈ వేడుకలు జరిగాయి. ఈ సారి వేడుకల్లో కరోనా కారణంగా చాలా మార్పులు జరిగాయి.
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా పరేడ్ ఎర్రకోటను చేరకుండా ముగుస్తున్నది. వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే శకటాల పరేడ్ విజయ్ చౌక్ నుంచి మొదలై ఎర్రకోట చేరకుండా నేషనల్ స్టేడియం వద్దనే ముగియనున్నది. 8.2 కిలోమీటర్లు సాగాల్సిన ఈ పరేడ్ కేవలం 3.3 కిలోమీటర్లకే కుదించారు. శకటాలతోపాటు ప్రదర్శనచేసే పార్టిసిపెంట్ల సంఖ్యను 144 నుంచి 96కు తగ్గించారు. వీరంతా తప్పకుండా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అలాగే, వీక్షకుల సంఖ్యనూ 1.15లక్షల నుంచి 25వేలకు తగ్గించారు. 15ఏళ్లలోపు పిల్లలను ఈ వేడుకలకు అనుమతించడం లేదు. రిపబ్లికే డే పరేడ్‌లో పాల్గొనడానికి ఢిల్లీ చేరిన 150 మంది జవాన్లకు కరోనా సోకడంతో ఇక్కడే క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, ఈ పరేడ్ తర్వాత రైతు సంఘాలు సాగు చట్టాలకు నిరసనగా ట్రాక్టర్ పరేడ్ నిర్వహించనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు.