విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోవచ్చు!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం భారీగా క్షీణిస్తుందని, 2025 ఏడాది నాటికి 7 శాతం నుంచి 17 శాతం వరకు డిమాండ్ తగ్గిపోతుందని ఎనర్జీ అండ్ రీసొర్సెస్ ఇన్‌స్టిట్యూట్(టీఈఆర్ఐ) నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధికంగా విద్యుత్‌ను వినియోగించే 10 రాష్ట్రాల్లో మాత్రమే 5 నుంచి 15 శాతం మేరకు డిమాండ్ క్షీణిస్తుందని నివేదిక తెలిపింది. దీనిపై కేంద్ర విద్యుత్ శాఖామంత్రి ఆర్‌కే సింగ్ స్పందిస్తూ.. లాక్‌డౌన్ వలన తాత్కాలిక వినియోగం తగ్గినా, […]

Update: 2020-07-23 03:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం భారీగా క్షీణిస్తుందని, 2025 ఏడాది నాటికి 7 శాతం నుంచి 17 శాతం వరకు డిమాండ్ తగ్గిపోతుందని ఎనర్జీ అండ్ రీసొర్సెస్ ఇన్‌స్టిట్యూట్(టీఈఆర్ఐ) నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధికంగా విద్యుత్‌ను వినియోగించే 10 రాష్ట్రాల్లో మాత్రమే 5 నుంచి 15 శాతం మేరకు డిమాండ్ క్షీణిస్తుందని నివేదిక తెలిపింది. దీనిపై కేంద్ర విద్యుత్ శాఖామంత్రి ఆర్‌కే సింగ్ స్పందిస్తూ.. లాక్‌డౌన్ వలన తాత్కాలిక వినియోగం తగ్గినా, త్వరలో డిమాండ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్ ఉన్నప్పటికీ డిమాండ్ కొనసాగుతుందని, దీర్ఘకాలంలో విద్యుత్ డిమాండ్‌ పై ప్రభావం ఉంటుందని అనుకోవడం లేదని, నెమ్మదిగా ఇది పెరుగుతుందని ఆయన వివరించారు. తాజాగా, ‘కొవిడ్-19 ‘విద్యుత్ డిమాండ్-2025 సూచనలు’ పేరుతో తయారు చేసిన ఈ నివేదికలో నాయకులు, డెవలపర్స్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ఇన్వెస్టర్లు దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది. ముఖ్యంగా వాణిజ్యం, పారిశ్రామిక డిమాండ్‌లో క్షీణత నమోదయ్యే అవకాశాలున్నాయని, డిస్కంలకు ఆర్థిక ఒత్తిడి ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది.

Tags:    

Similar News