రోమియోతో ‘రేణు’

దిశ, వెబ్‌డెస్క్: మంచి కథ, ప్రాజెక్ట్‌లో అవకాశమొస్తే మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో చెప్పిన రేణు దేశాయ్.. ఇటీవలే తన రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ వెబ్‌సిరీస్‌తో మీ ముందుకొస్తానని చెప్పేసిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది. తన అభిరుచులు, జ్ఞాపకాలు, అలవాట్లు, అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన హార్స్ రైడింగ్ గురించి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు షేర్ చేసింది. […]

Update: 2020-09-27 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంచి కథ, ప్రాజెక్ట్‌లో అవకాశమొస్తే మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో చెప్పిన రేణు దేశాయ్.. ఇటీవలే తన రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ వెబ్‌సిరీస్‌తో మీ ముందుకొస్తానని చెప్పేసిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది. తన అభిరుచులు, జ్ఞాపకాలు, అలవాట్లు, అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా తన హార్స్ రైడింగ్ గురించి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు షేర్ చేసింది.

అందమైన స్మైల్‌తో.. గుర్రంపై అలా ఓ వైపుగా వాలి ఉన్న తన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది రేణు. ‘ఇది చాలా నిద్రపోతుంది.. కానీ చాలా క్యూట్’ అని చెప్పిన రేణు.. దాని పేరు ‘రోమియో’ అని కూడా పేర్కొంది. ఆ ఫొటోతో పాటు ‘గుర్రాల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. నాకు 12 సంవత్సరాలున్నప్పుడు గుర్రపు స్వారీని నేర్చుకున్నాను. అవి చాలా తెలివైనవి, చురుకునైవి కూడా. అయితే, నాకు కాస్త సిక్‌గా ఉండటంతో 2015లో హార్స్ రైడింగ్ మానేశాను. దాంతో బరువు కూడా పెరిగాను. అయితే మళ్లీ గుర్రాలతో మ్యాజిక్ కనెక్షన్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నాను. అందుకే వెయిట్ తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను’ అని రేణు చెప్పుకొచ్చింది. ఇక రేణు కెరీర్ విషయానికి వస్తే.. త్వరలోనే తన వెబ్ సిరీస్ పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపింది. దీంతో పాటు.. తన దర్శకత్వంలో చిన్నపిల్లలతో ‘అన్నదాత సుఖీభవ’ చిత్రాన్ని తీస్తోంది.

https://www.instagram.com/p/CFl2bacB-zy/

Tags:    

Similar News