మీ అత్యుత్సాహం.. నా ఉనికికే ప్రమాదం : రేణు దేశాయ్

          రేణు దేశాయ్.. ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. కానీ అంతలోనే ప్రేమలో పడింది. అది కూడా పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్‌తో. చాలాకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. బాబు పుట్టాకే పెళ్లి చేసుకున్నారు. తర్వాత పాప కూడా. ఒక స్టార్ హీరోతో పెళ్లి, పిల్లలు .. సాఫీగా సాగిపోతున్న జీవితం. కానీ అంతలోనే విడిపోవాల్సి వచ్చింది. పిల్లల బాధ్యతలను తనే తీసుకుంది. కానీ.. తరచూ మీడియాలో తన గురించి వస్తోన్న వార్తల […]

Update: 2020-02-14 08:08 GMT

రేణు దేశాయ్.. ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.. కానీ అంతలోనే ప్రేమలో పడింది. అది కూడా పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్‌తో. చాలాకాలం వీరిద్దరూ సహజీవనం చేశారు. బాబు పుట్టాకే పెళ్లి చేసుకున్నారు. తర్వాత పాప కూడా. ఒక స్టార్ హీరోతో పెళ్లి, పిల్లలు .. సాఫీగా సాగిపోతున్న జీవితం. కానీ అంతలోనే విడిపోవాల్సి వచ్చింది. పిల్లల బాధ్యతలను తనే తీసుకుంది. కానీ.. తరచూ మీడియాలో తన గురించి వస్తోన్న వార్తల గురించి కృంగిపోతోంది.

ఆత్మగౌరవం, అస్థిత్వం, నిజాయితీతో కూడిన ఏ మహిళ అయినా.. మాజీ భర్త నుంచి ఏదో ఆశిస్తుంది అనే వార్తలతో బాధపడుతుంది. రేణు దేశాయ్ విషయంలోనూ అదే జరిగింది. అందుకే ఈ వివరణ ఇవ్వక తప్పలేదు. ‘నా జీవన మనుగడ కోసం ఒంటరిగా పోరాడుతున్నాను. నా పిల్లలను నేనే పెంచుకుంటున్నాను.. ఇందుకోసం కనీసం నా తండ్రి దగ్గర కూడా ఎలాంటి సాయం పొందలేదు. అలాంటిది మాజీ భర్త పవన్ కళ్యాణ్ దగ్గర భరణాన్ని ఎలా ఆశిస్తాను’ అంటూ సోషల్ మీడియాలో నోట్ రాసింది.

మీరు అనుకుంటున్నట్టు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్.. ఒక్కో రూపాయి కూడబెట్టి నేను కొన్నదే.. దానికి ఎవరిని డబ్బులు అడగలేదు.. ఎవరూ నాకు కొనివ్వలేదు అని తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా ఆత్మగౌరవం, నిజాయితీ .. చివరికి నా ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని … ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని సూచించింది.

నా మాజీ భర్తకు కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారం జరుగుతోందని తెలిసి ఉండదు. కనీసం ఆయన దృష్టికి వెళ్లి ఉండదు. కానీ మీరు ప్రచారం మాత్రం చేస్తున్నారు. మీ సంస్థల లాభం కోసం.. మీ అత్యుత్సాహంతో ఒక ఒంటరి మహిళ మనుగడను ప్రమాదంలోకి నెడతారా? ఇది మీకు న్యాయమేనా? అని ప్రశ్నించింది రేణు దేశాయ్. నేను మీతో పంచుకున్న ఈ బాధకు ఊహాగానాలు తోడు చేసి.. నాకు, నా మాజీ భర్తకు ఎలాంటి గొడవలు సృష్టించరని ఆశిస్తున్నాను అని కోరింది.

Tags:    

Similar News