ఎన్టీఆర్ చేయి విరగ్గొట్టిన దుండగులు..

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహం చేయి విరగ్గొట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ చేయి ధ్వంసం చేయడంపై మాజీమంత్రి దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత […]

Update: 2021-07-07 03:11 GMT

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహం చేయి విరగ్గొట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ చేయి ధ్వంసం చేయడంపై మాజీమంత్రి దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలను, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధించడమే పనిగాపెట్టుకున్నారని విమర్శించారు. తాజాగా తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి విగ్రహం చేయి విరగ్గొడతారా అంటూ మండిపడ్డారు. నందిగామలో టీడీపీ జెండా దిమ్మ పగలగొట్టారని ఇప్పుడు విగ్రహం చేయి విరగ్గొట్టారని నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా జగన్ మాత్రం తాడేపల్లి రాజప్రసాదం నుంచి బయటకు రాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణ జలాల వివాదంపై ప్రధానిని ఎందుకు కలవలేకపోతున్నారని నిలదీశారు. వైసీపీ చేతిలో 28 మంది ఎంపీలు ఉండి కూడా ప్రధానిని కలవకపోవడం ఏంటని ప్రశ్నించారు. మీరు కోటలో ఉంటే ఏమిటి పేటలో ఉంటే ఏమిటిని నిలదీశారు. ప్రధాని మోడీని కలిసే ధైర్యంలేక ఉత్తరాలు రాస్తున్నారని ఆ ఉత్తరాలు ఎవరికి కావాలని దేవినేని ఉమా నిలదీశారు. ప్రగతి భవన్ కి వెళ్లి బిర్యానీ తిన్నప్పుడు కృష్ణాజలాలు గుర్తుకు రాలేదా ?అని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రం నుంచి లక్ష కోట్లు ఖర్చుపెట్టి గోదావరి నీళ్లు తీసుకువస్తానన్న జగన్.. అదే పక్క రాష్ట్రం మీ తండ్రిని అడ్డగోలుగా తిడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మమ్మల్ని తిట్టడానికి మాత్రం ఈ అంబోతుల నోళ్లు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారుమళ్లకు నీళ్లు ఇవ్వలేరు కానీ విగ్రహాలు మాత్రం పగలగొడతారు ఈ దద్దమ్మలు అంటూ వైసీపీ ప్రభుత్వంపై దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News