కొవిడ్ చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్ తొలగింపు..

న్యూఢిల్లీ: అసిమ్టమిక్(కరోనా లక్షణాలు లేని), సాధారణ కరోనా లక్షణాలు కలిగిన కరోనా పేషెంట్స్‌కు ఐవర్ మెక్టిన్, డాక్సీ సైక్లీన్ వంటి మందులు ఇవ్వాల్సిన అవసరం లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) తెలిపింది. కొవిడ్ పేషెంట్స్ చికిత్స కోసం పునరుద్దరించిన మార్గదర్శకాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) జారీచేసింది. ఈ మేరకు కొవిడ్ చికిత్సలో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరావీర్, డాక్సీ సైక్లీన్, జింక్, మల్టీవిటమిన్ లాంటి మందులను అప్రూవ్డ్ ట్రీట్ […]

Update: 2021-06-07 05:47 GMT

న్యూఢిల్లీ: అసిమ్టమిక్(కరోనా లక్షణాలు లేని), సాధారణ కరోనా లక్షణాలు కలిగిన కరోనా పేషెంట్స్‌కు ఐవర్ మెక్టిన్, డాక్సీ సైక్లీన్ వంటి మందులు ఇవ్వాల్సిన అవసరం లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) తెలిపింది. కొవిడ్ పేషెంట్స్ చికిత్స కోసం పునరుద్దరించిన మార్గదర్శకాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్ఎస్) జారీచేసింది. ఈ మేరకు కొవిడ్ చికిత్సలో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఐవర్ మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్, ఫావిపిరావీర్, డాక్సీ సైక్లీన్, జింక్, మల్టీవిటమిన్ లాంటి మందులను అప్రూవ్డ్ ట్రీట్ మెంట్ జాబితా నుంచి డీజీహెచ్ఎస్ తొలగించింది. ఈ మేరకు డాక్టర్స్ కమ్యూనిటీకి కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది.

డీజీహెచ్ఎస్ నూతన మార్గదర్శకాల ప్రకారం.. కరోనా లక్షణాలు లేనివారు ఎలాంటి మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇక సాధారణ కరోనా లక్షణాలు ఉన్న వారు జ్వరానికి యాంటీపైరేటిక్, దగ్గుకు యాంటీ టస్సివ్ ఇవ్వాలని తెలిపింది. వీరికి ఎలాంటి ప్రత్యేకమైన కొవిడ్-19 మెడికేషన్ అవసరం లేదని చెప్పింది. ఒక వేళ ఇంకా అప్పటికీ సింప్టమ్స్ కనిపించినా, ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు అనిపించినా డాక్టర్ సూచన మేరకు చికిత్స పొందాలని సూచించింది. కాగా కొవిడ్ పేషెంట్స్‌కు మందులు రాసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలనీ, అనవసరమైన టెస్టులు రాసి వారిని ఇబ్బంది పెట్టవద్దని వైద్యులకు సూచించింది.

Tags:    

Similar News