ఇండియాలో ‘రెమ్‌డెసివిర్’ విక్రయం
ముంబయి: కొవిడ్-19 రోగుల చికిత్స కోసం వాడుతున్న యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్‌డెసివర్’ను మనదేశంలో విక్రయించేందుకు అమెరికాకు చెందిన ఔషద దిగ్గజ కంపెనీ గిలైడ్ సైన్సెస్ చూస్తోంది. ఈ మేరకు అనుమతి కోరుతూ ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే రెడ్‌డెసివర్‌కు సంబంధించి ప్రీ క్లినికల్, క్లినికల్ స్టడీస్‌ను గిలైడ్ సైన్సెస్ సమర్పించింది. యాంటీ వైరస్ డ్రగ్ రెమ్‌డెసివర్‌ను మనదేశంలో మార్కెటింగ్‌కు అనుమతి కోసం సీడీఎస్‌సీఓకు దరఖాస్తు చేసుకుంది. నిపుణుల […]
ముంబయి: కొవిడ్-19 రోగుల చికిత్స కోసం వాడుతున్న యాంటీ వైరల్ ఔషధం ‘రెమ్‌డెసివర్’ను మనదేశంలో విక్రయించేందుకు అమెరికాకు చెందిన ఔషద దిగ్గజ కంపెనీ గిలైడ్ సైన్సెస్ చూస్తోంది. ఈ మేరకు అనుమతి కోరుతూ ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ)కు దరఖాస్తు చేసుకుంది. ఇప్పటికే రెడ్‌డెసివర్‌కు సంబంధించి ప్రీ క్లినికల్, క్లినికల్ స్టడీస్‌ను గిలైడ్ సైన్సెస్ సమర్పించింది. యాంటీ వైరస్ డ్రగ్ రెమ్‌డెసివర్‌ను మనదేశంలో మార్కెటింగ్‌కు అనుమతి కోసం సీడీఎస్‌సీఓకు దరఖాస్తు చేసుకుంది. నిపుణుల బృందం సహకారంతో గిలైడ్ సైన్సెస్ దరఖాస్తును సీడీఎస్‌సీఓ అధికారులు పరిశీలించనున్నారు. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రెమ్‌డెసివర్ మార్కెటింగ్‌కు అనుమతిపై నిర్ణయం ఉంటుంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొవిడ్-19 కారణంగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారికి ‘అత్యవసర ఉపయోగపడే ఔషధం’ కింద రెమ్‌డెసివర్‌ను ఉపయోగించడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రంగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది.