MRP ధరకే రెమిడెసివర్… బారులు తీరిన జనం…

దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో రోజు రోజుకు కోవిడ్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా రోగులకు ఇంజెక్షన్ చేసే రెమిడెసివర్ డ్రగ్ మాత్రం రోగులకు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెటిరో డ్రగ్ కంపెనీ వారు మూసాపేట్ వై జంక్షన్ వద్ద గల గూడ్స్ స్టోరేజ్ బిల్డింగ్ లో కంపెనీ రిప్రజంటేటివ్ నేతృత్వంలో సరాసరి కంపెనీ నుండి తీసుకువచ్చి […]

Update: 2021-04-19 07:08 GMT

దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో రోజు రోజుకు కోవిడ్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా రోగులకు ఇంజెక్షన్ చేసే రెమిడెసివర్ డ్రగ్ మాత్రం రోగులకు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెటిరో డ్రగ్ కంపెనీ వారు మూసాపేట్ వై జంక్షన్ వద్ద గల గూడ్స్ స్టోరేజ్ బిల్డింగ్ లో కంపెనీ రిప్రజంటేటివ్ నేతృత్వంలో సరాసరి కంపెనీ నుండి తీసుకువచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఓ స్టాల్ ను ఏర్పాటు చేసి ఎమ్మార్పీ ధరకే డ్రగ్ ను అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో రెమిడెసివర్ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో హెటిరో డ్రగ్ కోసం జనాలు అధిక సంఖ్యలో క్యూ కట్టారు. ఈ క్రమంలో అక్కడ కొంతసేపు తోపులాట జరిగింది.

Tags:    

Similar News