రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల నగదీకరణ ప్రారంభం!
దిశ, వెబ్‌డెస్క్: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ ఇటీవల డిబెంచర్ హోల్డర్లు, ఇతర రుణదాతలకు చెల్లింపుల అంశంలో కంపెనీ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో రిలయన్స్ కేపిటల్ ఆస్తుల నగదీకరణ ప్రక్రియను ప్రారంభించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ హెల్త్, రిలయన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి సంస్థ ఆస్తులు సహా రిలయన్స్ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ 49 శాతం వాటా లాంటి ఇతర ఆస్తులు కంపెనీ పరిధిలో ఉన్నాయి. అయితే, సంస్థ […]
దిశ, వెబ్‌డెస్క్: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ ఇటీవల డిబెంచర్ హోల్డర్లు, ఇతర రుణదాతలకు చెల్లింపుల అంశంలో కంపెనీ విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో రిలయన్స్ కేపిటల్ ఆస్తుల నగదీకరణ ప్రక్రియను ప్రారంభించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ హెల్త్, రిలయన్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి సంస్థ ఆస్తులు సహా రిలయన్స్ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ 49 శాతం వాటా లాంటి ఇతర ఆస్తులు కంపెనీ పరిధిలో ఉన్నాయి.
అయితే, సంస్థ నగదీకరణ ప్రణాళికపై సంస్థ స్పందించడానికి నిరాకరించింది. రిలయన్స్ కేపిటల్‌కు చెందిన మొత్తం రూ. 15 వేల కోట్ల రుణాల్లో డిబెంచర్ హోల్డర్లు 99 శాతం వాటాను కలిగి ఉన్నారు. జులైలో రుణదాతలు, డిబెంచర్ హోల్డర్లకు రిలయన్స్ కేపిటల్ చెల్లించకపోవడంతో డీఫాల్ట్ అయ్యిందని, దీంతో జూన్ త్రైమాసికంలో నష్టాలు సంభవించాయని కంపెనీ వెల్లడించింది. ఇది కంపెనీ సామర్థ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నట్టు తెలుస్తోంది.