ఏపీలో అన్‌లాక్- 4 మార్గదర్శకాలు విడుదల

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4 మార్గదర్శకాల్లో భాగంగా ఈనెల 21నుంచి 9, 10, ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి తల్లిదండ్రల నుంచి రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అదేరోజు నుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కాలేజీలకు వెళ్లొచ్చని పేర్కొంది. 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపింది. ఈనెల 20నుంచి […]

Update: 2020-09-07 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4 మార్గదర్శకాల్లో భాగంగా ఈనెల 21నుంచి 9, 10, ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి తల్లిదండ్రల నుంచి రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. అదేరోజు నుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కాలేజీలకు వెళ్లొచ్చని పేర్కొంది. 100 మందికి మించకుండా సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపింది. ఈనెల 20నుంచి పెళ్లిళ్లకు 50మంది, అంత్యక్రియలకు 20మందికి అనుమతివ్వాలని నిర్ణయించింది.

Tags:    

Similar News