కిడ్నాప్ అయిన ఏపీవాసులు విడుదల

దిశ, వెబ్‎డెస్క్: లిబియాలో కిడ్నాప్ అయిన ఏపీ వాసులతో పాటు మొత్తం ఏడుగురు భారతీయ పౌరులు విడుదల అయ్యారు. లిబియాలోని అశ్వెరీఫ్ అనే ప్రాంతంలో సెప్టెంబర్ 14న ఏపీ, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు కిడ్నాప్‎కు గురైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. భారత్ వచ్చేందుకు ట్రిపోలీ ఎయిర్‎పోర్టుకు వచ్చే క్రమంలో వీరంతా కనిపించకుండా పోయారు. శ్రీకాకుళం జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కనిపించకపోవడంతో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంటు […]

Update: 2020-10-12 04:47 GMT

దిశ, వెబ్‎డెస్క్: లిబియాలో కిడ్నాప్ అయిన ఏపీ వాసులతో పాటు మొత్తం ఏడుగురు భారతీయ పౌరులు విడుదల అయ్యారు. లిబియాలోని అశ్వెరీఫ్ అనే ప్రాంతంలో సెప్టెంబర్ 14న ఏపీ, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు కిడ్నాప్‎కు గురైనట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

భారత్ వచ్చేందుకు ట్రిపోలీ ఎయిర్‎పోర్టుకు వచ్చే క్రమంలో వీరంతా కనిపించకుండా పోయారు. శ్రీకాకుళం జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కనిపించకపోవడంతో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించారు. వారి అచూకీ కోసం చర్యలు తీసుకోవాలంటూ ఆయన కేంద్రానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో లిబియాలోని భారత దౌత్యాధికారులు ఎంతో శ్రద్ధ తీసుకుని తీవ్ర పయత్నాల అనంతరం ఆదివారం అర్ధరాత్రి తర్వాత భారతీయులను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. కిడ్నాప్ అయిన ఏడుగురు కార్మికులు సురక్షితంగా విడుదల అయ్యారని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

Tags:    

Similar News