ప్రైవేటు టీచర్లకు రూ.32కోట్లు విడుదల

దిశ,తెలంగాణ బ్యూరో: ప్రైవేటు పాఠశాలల టీచర్లకు, ఇతర సిబ్బందికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.32కోట్లను విడుదల చేసింది. తెలంగాణలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు నిధులను అందిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది. ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ నిధులను విడుదల చేసామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది. ఈ ఏప్రిల్ నెల నుంచే ప్రైవేటు పాఠశాల సిబ్బందికి రూ.2000 ఆర్థిక సాయం అందించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు విద్యాశాఖ […]

Update: 2021-04-12 10:39 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: ప్రైవేటు పాఠశాలల టీచర్లకు, ఇతర సిబ్బందికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం రూ.32కోట్లను విడుదల చేసింది. తెలంగాణలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు నిధులను అందిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటనను విడుదల చేసింది. ప్రైవేట్ పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ నిధులను విడుదల చేసామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది.

ఈ ఏప్రిల్ నెల నుంచే ప్రైవేటు పాఠశాల సిబ్బందికి రూ.2000 ఆర్థిక సాయం అందించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇబిఎస్ఎం డిపార్ట్మెంట్ ద్వారా విద్యాశాఖ డైరెక్టర్‌కు నిధులను అందిస్తున్నట్టగా తెలిపారు. అర్హులైన ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి అందరికి ఆర్థిక సహాయం అందేలా తెలంగాణలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తగిన చర్యలు చేపడుతుందని వివరించారు.

Tags:    

Similar News