డ్వాక్రామహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఈ రోజే అకౌంట్‌లో డబ్బులు

దిశ, వెబ్‌డెస్క్  : డ్వాక్రా మహిళ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహిళలకు అండగా ఉండేందుకు, వారికి ఆర్థికపరమై చేయుతనిచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళ సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొదటి విడతగా ప్రతీ మహిళా సంఘానికి 15000 రూపాయిలు రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేసింది. ఈ ఫండ్ నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ […]

Update: 2021-08-19 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్ : డ్వాక్రా మహిళ సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహిళలకు అండగా ఉండేందుకు, వారికి ఆర్థికపరమై చేయుతనిచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళ సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పడిన డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొదటి విడతగా ప్రతీ మహిళా సంఘానికి 15000 రూపాయిలు రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేసింది. ఈ ఫండ్ నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నగదును మళ్లీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. మహిళా సంఘాలు సంయుక్తంగా కలిసి వ్యాపారాలు పెట్టుకొని స్వయం ఉత్పత్తి కింద అభివృద్ధి చెందడానికి ఈ రుణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే స్వయం ఉపాధి పథకాలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొంది ఎవరి కాళ్ల మీద వారు బతకడానికి ఈ రుణాలు ఉపయోగపడుతున్నాయి. అలాగే మహిళలలు కూడా సకాలంలో రుణాలు చెల్లిస్తున్నారు. అందువలన మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ఈ రివాల్వింగ్ ఫండ్ విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

 

Tags:    

Similar News