హుజూరాబాద్‌లో ముగిసిన కీలక ఘట్టం.. అసలు ఆట ఇప్పుడే..!

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల పర్వంలో మరో ఘట్టం ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సోమవారం పూర్తయింది. ఈ నెల 8న ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 19 మంది అభ్యర్థులు వేసిన 23 సెట్ల పత్రాలను తిరస్కరించారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం నామినేషన్‌లు తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం […]

Update: 2021-10-11 06:26 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల పర్వంలో మరో ఘట్టం ముగిసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన సోమవారం పూర్తయింది. ఈ నెల 8న ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో 19 మంది అభ్యర్థులు వేసిన 23 సెట్ల పత్రాలను తిరస్కరించారు. అభ్యర్థులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం నామినేషన్‌లు తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. నిబంధనల ప్రకారం నామినేషన్లు సమర్పించని వాటిని తిరస్కరించామని స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 13 వరకు నామినేషన్ల విత్ డ్రాకు గడువు ఉందని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News