బంగారం ధరలు యూటర్న్…
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే… మరో వైపు బంగారం ధర ఆకాశానికి దూసుకెళ్లింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ట్రేడ్ వార్ పరిణామాలతో దీర్ఘకాలంలో బంగారం లాభాల్లో దూసుకుపోతోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ, గత రెండ్రోజులుగా తగ్గిన బంగారం ధరలు, గురువారం వరుసగా మూడో రోజు కూడా దిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో.. దేశీ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే… మరో వైపు బంగారం ధర ఆకాశానికి దూసుకెళ్లింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ట్రేడ్ వార్ పరిణామాలతో దీర్ఘకాలంలో బంగారం లాభాల్లో దూసుకుపోతోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ, గత రెండ్రోజులుగా తగ్గిన బంగారం ధరలు, గురువారం వరుసగా మూడో రోజు కూడా దిగాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో.. దేశీ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్‌లో తులం బంగారం రూ.547 తగ్గి రూ.52,075కు దిగింది. ఇక కిలో వెండి రూ.804 తగ్గి రూ.67,519కు పడిపోయింది.
ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారట్ల బంగారం ధర రూ.720 తగ్గి రూ.50,840కు చేరింది. అలాగే 24 క్యారట్ల బంగారం ధర రూ.780 తగ్గి రూ.55,460కు చేరింది. ఇదిలావుండగా వడ్డీరేట్ల తగ్గింపు కొనసాగుతుందని ఫెడ్ ప్రకటించింది. దీంతో మార్కెట్‌లో ద్రవ్య లభ్యత పెరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే సంకేతాలు అందాయి. పది గ్రాముల బంగారం గత రెండు రోజులుగా రూ.1,600 తగ్గగా.. వెండి ధరలు ఏకంగా రూ.2,000లకు దిగివచ్చాయి.