ఎర్ర రాయిపై ఫోకస్ లేదు.. ఎందుకు ?
దిశ, జహీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధి భూగర్భ గనుల శాఖ నియమ నిబంధనలను పాటించకుండా జహీరాబాద్ నియోజకవర్గంలో ఎర్ర రాయి దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు సర్వత్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన వనరులు రాయి, మట్టి, నీరు, చెట్లు భూమి నుంచి వెలుపలికి ( తీసీ ) తొలగించి ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి సంబంధిత భూగర్భ గనుల శాఖ అధికారుల అనుమతులు కచ్చితంగా పొందాలని ఉన్నటువంటి నిర్దిష్టమైన షరతులు వర్తించటంలేదు. […]
దిశ, జహీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధి భూగర్భ గనుల శాఖ నియమ నిబంధనలను పాటించకుండా జహీరాబాద్ నియోజకవర్గంలో ఎర్ర రాయి దందా యథేచ్ఛగా సాగుతున్నట్లు సర్వత్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన వనరులు రాయి, మట్టి, నీరు, చెట్లు భూమి నుంచి వెలుపలికి ( తీసీ ) తొలగించి ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి సంబంధిత భూగర్భ గనుల శాఖ అధికారుల అనుమతులు కచ్చితంగా పొందాలని ఉన్నటువంటి నిర్దిష్టమైన షరతులు వర్తించటంలేదు.
జహీరాబాద్ ప్రాంతంలో ఎర్ర రాయి దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బుట్టదాఖలు చేస్తూ అక్రమార్కలు వ్యాపారం చేస్తుండటం చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. నియోజకవర్గంలో ప్రధానంగా జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, మొగుడం పల్లి మండలాల పరిధిలోని వివిధ ప్రదేశాలలో ఎర్ర రాయి అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ వాటిని నివారించవలసిన బాధ్యత గల సంబంధిత రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పన్ను రూపేణా ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు ఎగ్గొట్టి, ఎర్ర రాయి అక్రమ దందాతో సంవత్సరాల తరబడి నుంచి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. అక్రమార్కులపై ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందేనని జహీరాబాద్ ప్రాంత ప్రజలు అంటున్నారు.