ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లలో రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తరఖండ్‌లోని 13 జిల్లాలతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా ఉత్తరఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆదివారం స్టేట్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్)కూడా ఇలాంటి హెచ్చరికలనే జారీ చేసింది. ఉత్తరఖండ్‌లో జూలై 19 నుంచి 21వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తరఖండ్‌లోని 13 జిల్లాలతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా ఉత్తరఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఆదివారం స్టేట్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్(ఎస్డీఆర్ఎఫ్)కూడా ఇలాంటి హెచ్చరికలనే జారీ చేసింది.
ఉత్తరఖండ్‌లో జూలై 19 నుంచి 21వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎస్డీఆర్ఎఫ్ ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. రానున్న 72 గంటల్లో జమ్ము కశ్మీర్, అస్సాం, మేఘాలయా, మిజోరం, త్రిపురలల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది.