లాక్‌డౌన్‎‌లో ఉత్తమ సేవలు.. వారికే సొంతం

దిశ, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. సమాజ సేవా కార్యక్రమాల నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉండే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాక్‌డౌన్ పీరియడ్ లోనూ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే ఆయా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కేంద్రాల నుంచి తలసీమియా బాధితులకు రక్తం అందిస్తూ, వారి ప్రాణాలను నిలబెడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశమంతా లాక్‌డౌన్ నిబంధనలతో ఇండ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి ఆపత్కాలంలోనూ […]

Update: 2020-05-17 10:51 GMT

దిశ, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమలవుతోంది. సమాజ సేవా కార్యక్రమాల నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉండే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాక్‌డౌన్ పీరియడ్ లోనూ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఇప్పటికే ఆయా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కేంద్రాల నుంచి తలసీమియా బాధితులకు రక్తం అందిస్తూ, వారి ప్రాణాలను నిలబెడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశమంతా లాక్‌డౌన్ నిబంధనలతో ఇండ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి ఆపత్కాలంలోనూ రకరకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. అత్యవసర సమయంలోనూ రోగులకు కావాల్సిన రక్తం అందించడంలో రెడ్ క్రాస్ అవిరాళంగా కృషి చేసింది. ముఖ్యంగా లాక్‌డౌన్ పీరియడ్ లో దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహించిన రెడ్ క్రాస్ సొసైటీ.. ఢిల్లీ కేంద్రం నుంచి ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది.

రాష్ట్రాలలో తెలంగాణకు 2వ ర్యాంక్ ..

లాక్‌డౌన్ ప్రారంభమైన మార్చి 23 నుంచి మే 15 వరకూ దేశంలోని రెడ్ క్రాస్ సొసైటీలు ఎన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించారు.. ఎన్ని యూనిట్ల రక్తాన్ని సేకరించారు.. ఆయా జిల్లాల్లో తలసీమియా బాధితులకు ఎన్ని యూనిట్లను అందజేశారు.. ఇతర రోగులకు ఎన్ని యూనిట్లను ఇవ్వగలిగారు.. అనే విషయాలపై ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉత్తమ సేవలు అందించిన 5 ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 39 వేల 832 యూనిట్ల రక్తాన్ని సేకరించగా.. అందులో 8399 యూనిట్ల రక్తాన్ని సేకరించి గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. 7553 యూనిట్ల రక్తాన్ని సేకరించి తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. వరుసగా మహారాష్ట్ర మూడో స్థానం (5038 యూనిట్లు), కర్నాటక నాలుగు (4840 యూనిట్లు), ఆంధ్రప్రదేశ్ 4138 యూనిట్లను సేకరించి ఐదో స్థానంలో నిలిచింది.

4వ స్థానంలో వరంగల్ ..

దేశ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీకి 89 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఉత్తమ సేవలు అందించినందుకు రాష్టాలతో పాటు జిల్లాల వారీగా కూడా ర్యాంకింగ్స్ కేటాయించారు. ఈ మేరకు దేశంలోని 89 బ్లడ్ బ్యాంక్ లలో.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం బ్లడ్ బ్యాంక్ కేంద్రానికి మొదటి స్థానం, ఒరిస్సాలోని కటక్ బ్లడ్ బ్యాంక్ కు రెండో స్థానం, అహ్మదాబాద్ బ్లడ్ బ్యాంక్ కు మూడో స్థానం లభించాయి. అయితే, రాష్ట్రానికి చెందిన వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి నాలుగో స్థానం, హైదరాబాద్ జిల్లా ఐదో స్థానం దక్కించుకున్నాయి. వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 25 బ్లడ్ డొనేషన్స్ క్యాంపులు నిర్వహించి, 2036 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ సేకరించిన రక్తంలో 300 తలసీమియా బాధితులకు 397 యూనిట్లను, అత్యవసర సమయాలలో 1288 యూనిట్లను రోగులకు అందజేశారు. హైదరాబాద్ జిల్లాలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా సేకరించిన 300 యూనిట్లను తలసీమియా బాధితులకు అందించారు.

ప్రజల్లో మానవత దాగుందనడానికి నిదర్శనం: డా. విజయ చందర్ రెడ్డి

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్‌తో తీవ్ర భయాందోళనలో ఉన్నాయి. వాస్తవానికి ఇలాంటి ఆపత్కాలంలో రక్తం లభ్యం కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ సొసైటీ అనేక కార్యక్రమాలను నిర్వహించింది. ముఖ్యంగా తలసీమియా బాధితులకు, అత్యవసరమైన ఇతర రోగులకు రక్తం నిల్వలు కొరతగా ఉండకూడదంటూ ఈ కార్యక్రమాన్నిచేపట్టాం. రెడ్ క్రాస్ చేసిన కార్యక్రమాలకు ప్రజలు కూడా అదే స్థాయిలో స్పందించారు. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల్లో మానవతా మూర్తులు ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. దేశ వ్యాప్తంగా రెడ్ క్రాస్ సోసైటీ సేవలలో తెలంగాణకు రెండో స్థానం, వరంగల్ జిల్లాకు నాల్గో స్థానం లభించడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News