క్వింటా పత్తి రూ.8,320.. తెల్లబంగారానికి రికార్డు ధర
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి రికార్డు ధరలు నమోదు చేస్తోంది. సోమవారం మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో క్వింటాల్ పత్తి ధర 8, 320 రూపాయలు నమోదైంది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాహుల్ వెల్లడించారు. మరోవైపు సాగు విస్తీర్ణం తగ్గడమూ ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ తాము పండించిన పంటకు మంచి ధర పలుకుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. […]
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి రికార్డు ధరలు నమోదు చేస్తోంది. సోమవారం మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో క్వింటాల్ పత్తి ధర 8, 320 రూపాయలు నమోదైంది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాహుల్ వెల్లడించారు. మరోవైపు సాగు విస్తీర్ణం తగ్గడమూ ఇందుకు మరో కారణంగా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ తాము పండించిన పంటకు మంచి ధర పలుకుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ తాము పడిన కష్టానికి తగిన ఫలితం దొరుకుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సీజన్లోనూ పత్తికి ఇలాగే మంచి ధర పలికితే… ఈ తెల్ల బంగారం సాగు విస్తీర్ణం అంతకంతకూ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.