అయిర నారాయణరెడ్డి రికార్డు..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో నిర్మల్ జిల్లాకు చెందిన అయిర నారాయణరెడ్డి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. 1987నుంచి ఇప్పటిదాకా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో ఆయన సొసైటీ చైర్మన్‌గా ఎన్నికవుతూ వచ్చారు. నిర్మల్ జిల్లా కౌట్ల బి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షునిగా 1987లో తొలిసారిగా గెలుపొందిన ఆయన 1992, 1997, 2006, 2013 సంవత్సరాల్లో జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ […]
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో నిర్మల్ జిల్లాకు చెందిన అయిర నారాయణరెడ్డి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. 1987నుంచి ఇప్పటిదాకా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో ఆయన సొసైటీ చైర్మన్‌గా ఎన్నికవుతూ వచ్చారు. నిర్మల్ జిల్లా కౌట్ల బి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షునిగా 1987లో తొలిసారిగా గెలుపొందిన ఆయన 1992, 1997, 2006, 2013 సంవత్సరాల్లో జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి వరుస విజయాలు సాధించారు. మళ్లీ ఇప్పుడు 2020లో జరిగిన సహకార ఎన్నికల్లోనూ ఆయన కౌట్ల బి సొసైటీ నుంచి విజయం సాధించడం గమనార్హం. గతంలో ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీఎంఎస్‌కు రెండుసార్లు చైర్మన్‌గా వ్యవహరించారు. తెలంగాణాతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనూ వరుసగా ఆరుసార్లు సహకార సంఘానికి చైర్మన్‌గా విజయం సాధించిన రైతు నేత ఈయన ఒక్కరేనని జిల్లా సహకార అధికారులు కూడా బెబుతున్నారు.