కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి

దిశ, తెలంగాణ బ్యూరో : లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వ నిబంధనలను పాటించని కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) డిమాండ్ చేసింది. పరీక్ష ఫలితాలు ప్రభుత్వం ప్రకటించక ముందే కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను మాయమాటలతో మభ్య పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి కోర్స్ పేరుతో క్లాసులు నిర్వహించడం సరైంది కాదని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలతో పేర్కొంది. టెన్త్, ఇంటర్ బోర్డ్ లకు విద్యార్థులు ఫిర్యాదు […]

Update: 2021-05-16 07:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వ నిబంధనలను పాటించని కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) డిమాండ్ చేసింది. పరీక్ష ఫలితాలు ప్రభుత్వం ప్రకటించక ముందే కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను మాయమాటలతో మభ్య పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి కోర్స్ పేరుతో క్లాసులు నిర్వహించడం సరైంది కాదని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలతో పేర్కొంది. టెన్త్, ఇంటర్ బోర్డ్ లకు విద్యార్థులు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని విమర్శించింది. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ ప్రభుత్వాన్ని డిమాండ్​చేసింది.

Tags:    

Similar News