ఈ నెల 25న లాంచ్ కానున్న రియల్‌మీ టీవీలు

దిశ, వెబ్ డెస్క్: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ కూడా మరో చైనా కంపెనీ ‘షియోమీ’ అడుగుజాడల్లోనే నడుస్తోంది. షియోమీ గతంలోనే స్మార్ట్ టీవీలను తీసుకురాగా.. ఇప్పుడు రియల్‌మీ కూడా భారత టీవీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న రియల్‌మీ టీవీలు.. మే 25న లాంచ్ కాబోతున్నట్లు రియల్‌మీ ఇండియా హెడ్ మాధవ్ సేథ్ స్పష్టం చేశారు. రియల్‌మీ మొదట తన స్మార్ట్ టీవీలను ఫిబ్రవరిలో జరగాల్సిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC -2020)లో […]

Update: 2020-05-21 01:35 GMT

దిశ, వెబ్ డెస్క్: చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ కూడా మరో చైనా కంపెనీ ‘షియోమీ’ అడుగుజాడల్లోనే నడుస్తోంది. షియోమీ గతంలోనే స్మార్ట్ టీవీలను తీసుకురాగా.. ఇప్పుడు రియల్‌మీ కూడా భారత టీవీ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న రియల్‌మీ టీవీలు.. మే 25న లాంచ్ కాబోతున్నట్లు రియల్‌మీ ఇండియా హెడ్ మాధవ్ సేథ్ స్పష్టం చేశారు.

రియల్‌మీ మొదట తన స్మార్ట్ టీవీలను ఫిబ్రవరిలో జరగాల్సిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC -2020)లో ప్రదర్శించేందుకు సిద్ధమైంది. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ మెగా ట్రేడ్ షో రద్దు కావడంతో ఆ ప్రణాళికలు క్యాన్సిల్ అయ్యాయి. అయితే రియల్‌మీ కంపెనీ నుంచి వస్తున్న మొదటి టీవీని మనదేశంలోనే లాంచ్ చేయనుండటం విశేషం.

రియల్‌మీ ఫీచర్స్

– ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే రియల్‌మీ టీవీల్లో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, యూ‌ట్యూబ్ ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా రానున్నాయి.
– ఈ స్మార్ట్ టీవీలో 24 డబ్య్లూ స్టీరియో స్పీకర్లు, క్రోమా బూస్ట్ మోడ్‌ ఉండనుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది.
– రియల్‌మీ లాంచ్ చేయనున్న మూడు మోడల్స్‌ (32 ఇంచులు, 43ఇంచులు, 55ఇంచులు)
– 32, 43 ఇంచుల టీవీలకు ఎల్‌సీడీ స్క్రీన్లు ఉండనుండగా.. 55 ఇంచుల టీవీకి క్యూ ఎల్‌ఈడీ స్క్రీన్ ఉంటుంది.
– గూగుల్ ప్లే స్టోర్ నుంచి కావాల్సిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది.
– గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉండనుండటంతో వాయిస్ కమాండ్స్‌తోనే టీవీని ఆపరేట్ చేయొచ్చు.
– బ్లూ టూత్, వైఫై ఫీచర్లు కూడా ఉన్నాయి.
– ఎంఐ టీవీ ధరల మాదిరిగానే.. రియల్‌మీ టీవీ ధరలు కూడా ఉండనున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా తెలియలేదు.
– రియల్‌మీ టీవీలను ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ. కామ్ నుంచి కొనుగోలు చేయొచ్చు. లాంచింగ్ రోజున ఫస్ట్ డే సేల్ వివరాలు వెల్లడించే అవకాశముంది.

Tags:    

Similar News