తప్పు చేస్తే చావు నుంచి తప్పించుకోవచ్చేమో కానీ.. ఈ లేడీ శివంగి నుంచి తప్పించుకోలేరు

దిశ,వెబ్‌డెస్క్: ఓ మగువా..! నీ అందం వర్ణనాతీతం, నేను రవి వర్మని కాకపోతినే నీ అందాన్ని బొమ్మలా మలిచే భాగ్యం దక్కేదేమో. నేను ఆత్రయనైనా బాగుండు నీ సుందర రూపాన్ని వర్ణించే అదృష్టం కలుగునేమో. ఆగండాగండి ఫొటో చూసి ఊహల్లో విహరిస్తున్నారేమో. ఇక్కడ ఉంది లేడీ శివంగి. చూడటానికి పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు. ది మోస్ట్‌ వయోలెంట్‌ ఉమెన్. తప్పు చేస్తే చావు నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ ఈ లేడీ శివంగి నుంచి తప్పించుకోవడం చాలా […]

Update: 2021-02-10 05:12 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఓ మగువా..! నీ అందం వర్ణనాతీతం, నేను రవి వర్మని కాకపోతినే నీ అందాన్ని బొమ్మలా మలిచే భాగ్యం దక్కేదేమో. నేను ఆత్రయనైనా బాగుండు నీ సుందర రూపాన్ని వర్ణించే అదృష్టం కలుగునేమో. ఆగండాగండి ఫొటో చూసి ఊహల్లో విహరిస్తున్నారేమో. ఇక్కడ ఉంది లేడీ శివంగి. చూడటానికి పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు. ది మోస్ట్‌ వయోలెంట్‌ ఉమెన్. తప్పు చేస్తే చావు నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ ఈ లేడీ శివంగి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఒక్కసారి డౌటొచ్చిందంటే అంతే సంగతులు సప్త సముద్రాలు దాటొచ్చి తాటతీస్తుంది.

చీరకడితే అందానికే అందం. తుపాకీ పడితే లేడీ సింగం. అందుకే అతిచిన్న వయస్సులోనే కమిషనర్ స్థాయికి చేరింది. కరడుగట్టిన నేరస్థుల్ని సైతం పరుగులు పెట్టిస్తుంది. ఆమె కేరళ రాష్ట్రం కొల్లాంకు చెందిన పోలీస్ కమిషనర్ మెరీనా జోసెఫ్. మెరీనా అంటే నేరస్తులకు వెన్నులో వణుకు పుడుతుంది. పైకి చూడటానికి స్మార్ట్ గా కనిపించినా లోపల మాత్రం చాలా వయోలెంట్. తప్పు చేస్తే చాలు తాటతీసి వదిలేయడమే. అందుకే చిన్న వయస్సులో కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమె ఇప్పుడు ఎంతో మంది యువతీయువకులకు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.

1990 ఏప్రిల్ 20న కేరళలో ఎర్నాకుళంలో జన్మిచింది మెరీనా జోసెఫ్. ఉద్యోగ రిత్యా తల్లిదండ్రులు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆమె విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే పూర్తి చేసుకుంది. అయితే మెరీనా జోసెఫ్‌ కు భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ అంటే చాలా ఇష్టం. పిల్లల్ని పెద్దైతే మీరేమవుతారంటే నేను డాక్టర్‌ అవుతా. మెగాస్టార్ చిరంజీవిలా హీరో అవుతానని బదులిస్తారు. కానీ మెరీనా జోసెఫ్ మాత్రం సిక్త్స్ క్లాస్ చదివే సమయంలో తల్లిదండ్రులు, బంధువులు పెద్దైతే నువ్వేమవుతావని అడిగితే తడుముకోకుండా ఐపీఎస్ అవుతానంటూ తన మనసులోని మాట బయటపెట్టింది. దీంతో ఆమె తల్లిదండ్రులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్నపిల్ల అలాగే మాట్లాడుతుందని అనుకున్నారు. కానీ మెరీనా మాత్రం లక్ష్యం నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసింది. బీఏ ఆనర్స్ పూర్తి చేసి 2012లో సివిల్స్ లో 188వ ర్యాంక్ సాధించింది. ఆమె కెరియర్ కు హైదరాబాద్ లోనే అడుగులు పడ్డాయి. సర్ధార్ వల్ల బాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని యూత్ 20 సదస్సులో ఇండియన్ టీం కి లీడర్ గా బాధ్యతలు చేపట్టింది.

ఆ తరువాత ఎర్నాకుళంలో ఏఎన్పీ అండర్ ఆఫీసర్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టి డేరింగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరు సంపాదించించింది. చిన్నవయస్సులోనే కమిషనర్ గా కేరళ కొల్లాంకు 2019లో కమిషనర్ గా బాధ్యతలు చేపట్టింది. ఆ సమయంలో అక్కడ క్రైమ్ రేట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకు కారణం క్రిమినల్స్ కేరళ నుంచి ఈజీగా దుబాయ్‌కి వెళ్లేవారు. అక్కడ ఎంజాయ్ చేసేవారు. స్వదేశంలో కేసులు అలా పెరిగిపోయేవి. అయితే కమిషనర్ గా వచ్చీరాగానే పాత కేసుల్ని తిరగదోడింది. వాటిల్లో ఓ బాలిక ఆత్మహత్య కేసు మెరీనా‌ కంటపడింది.

2017లో కేరళ కొల్లాంకు చెందిన సునీల్ కుమార్ బర్దన్ కు స్నేహితుడి తమ్ముడి కూతురు పరిచయం అయ్యింది. ఆ పరిచయంతోనే బాలికను బెదిరించి.. మూడు నెలలపాటు ఆమె అత్యాచారం చేశాడు. ఆపై కేరళ నుంచి దుబాయ్‌కి చెక్కేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధిత బాలికను కేరళలోని రెస్క్యూ హోం‌కు తరలించారు. అయితే జూన్ 2017ను అదే ప్రభుత్వ రెస్క్యూ హోం‌లో బాధితురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత ఆ నీచుడిని బాలికకు పరిచయం చేసిన చిన్నాన్న కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రోజులు గడిచే కొద్ది ఆ కేసును పోలీసులు పట్టించుకోలేదు.

అయితే కమిషనర్ స్థాయిలో మెరీనా ఆ కేసును తిరగదోడింది. 2010లో ఫిబ్రవరి 28న ప్రధాని మన్మోహన్, సౌదీ రాజు అబ్దుల్లా సమక్షంలో భారత్ – దుబాయ్‌ల మధ్య నేరస్థుల అప్పగించేలా ఒప్పందం కుదిరింది. ఆర్టికల్ 23.1 ప్రకారం 2011 అక్టోబర్ 5 నుండి అమల్లోకి వచ్చింది. ఈ ఆర్టికల్ 23.1 ఆధారంగా ఎలాగైనా ఆ నీచుడికి శిక్ష వేయించాలని డిసైడ్ అయిపోయింది. అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. సీబీఐ ద్వారా వివరాలు సేకరించింది. ఆ నీచుడిని భారత్ కు రప్పించేందుకు కావాల్సిన ప్రొసీజర్స్ ప్రారంభించింది.

కేసు విచారణలో భాగంగా తన టీంతో కలిసి కేంద్రం సహకారంతో సౌదీ విమానం ఎక్కేసింది. అక్కడి దుబాయ్ ప్రభుత్వంతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారులతోనూ మాట్లాడింది. ఎలాగైతేనేం చివరకు కలుగులో దాక్కున్న కామాంధుడిని దుబాయ్ నుంచి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి కేరళ జైల్లో పడేసింది. అంతటితో ఆగకుండా కేసునుంచి తప్పించుకోకుండా పలు సెక్షన్లు కింద స్ట్రాంగ్‌గా కేసులు నమోదు చేసింది. విచారణ చేపట్టిన కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం నిందితుడు జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుందో ఈ కేసుతో నిరూపించిన మెరీనా జోసెఫ్‌కు దేశ ప్రజలు శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News