టీఆర్ఎస్‌కు ఓటు వేయొద్దు !
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓట్లు వేయొద్దని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గురువారం ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కొవిడ్ టైమ్‌లో ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని విమర్శించింది. కరోనా నేపథ్యంలో అన్నివర్గాల వారు ఆర్థికంగా చితికిపోయి ఉంటే వారి నుంచి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు జీవో 135తీసుకొచ్చి ప్రజలను ఆర్థిక సమస్యల్లోకి నెట్టిందని ఆరోపించారు. ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరూ […]
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓట్లు వేయొద్దని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గురువారం ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కొవిడ్ టైమ్‌లో ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని విమర్శించింది. కరోనా నేపథ్యంలో అన్నివర్గాల వారు ఆర్థికంగా చితికిపోయి ఉంటే వారి నుంచి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు జీవో 135తీసుకొచ్చి ప్రజలను ఆర్థిక సమస్యల్లోకి నెట్టిందని ఆరోపించారు. ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్‌కు ఓటు వేయకుండా తగిన గుణపాఠం చెప్పాలని అసోసియేషన్ కోరింది. ఓపెన్ ప్లేస్ లేదని మార్కెట్ విలువపై 14శాతం అదనపు చార్జీని వసూలు చేయడం న్యాయం కాదని పేర్కొన్నది.