ప్రతిసారీ అలానే జరగడం చాలా బాధగా ఉంది : కోహ్లీ

దిశ, వెబ్‌డెస్క్ : సన్ రైజర్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచులో మేము తగినన్ని పరుగులు చేయలేక పోయాము. హైదరాబాద్ జట్టులో కేన్ విలియమ్‌సన్ లాంటి ఆటగాడు ఉండటం వారికి కలిసి వచ్చింది. ప్రతీసారి ఐపీఎల్ గెలవాలనే వస్తాము. కానీ, ఈ సారి ఎలిమినేటర్ దశలోనే నిష్క్రమించడం చాలా బాధగా ఉన్నది.మనం ఎలాంటి పరిస్థితుల్లో ఆడినా గెలుపే ప్రధానం. అది మేము సాధించలేకపోయాము. – విరాట్ కోహ్లీ, కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మేం వరుసగా […]

Update: 2020-11-06 23:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

సన్ రైజర్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచులో మేము తగినన్ని పరుగులు చేయలేక పోయాము. హైదరాబాద్ జట్టులో కేన్ విలియమ్‌సన్ లాంటి ఆటగాడు ఉండటం వారికి కలిసి వచ్చింది. ప్రతీసారి ఐపీఎల్ గెలవాలనే వస్తాము. కానీ, ఈ సారి ఎలిమినేటర్ దశలోనే నిష్క్రమించడం చాలా బాధగా ఉన్నది.మనం ఎలాంటి పరిస్థితుల్లో ఆడినా గెలుపే ప్రధానం. అది మేము సాధించలేకపోయాము.

– విరాట్ కోహ్లీ, కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

మేం వరుసగా మ్యాచులు గెలిస్తే కాని చివరి అంకానికి చేరుకోము అని మాకు తెలుసు. మా జట్టులో నటరాజన్, రషీద్ కీలక సభ్యలుగా భావించాము. కానీ ఎప్పుడైతే హోల్డర్ తుది జట్టులో చేరాడో.. జట్టు సమతుల్యం సంతరించుకున్నది. మా లక్ష్యాన్ని మేము చేరుకుంటామనే ధీమా ఉన్నది.

– డేవిడ్ వార్నర్, కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్

ఇది చాలా కఠినమైన సమయం అని నాకు తెలుసు. జట్టులో ఎప్పుడు ఆడుతున్నామని కాదు.. కానీ జట్టుకు ఏమి అవసరం అనేది నాకు అవగాహన ఉన్నది. ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సి ఉన్నది కాబట్టి నా శాయాశక్తులా కృషి చేశాను.

– కేన్ విలియమ్‌సన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సన్‌రైజరస్ హైదరాబాద్

Tags:    

Similar News