గెలిచిందని.. ముద్దు పెట్టేశాడు!

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు జోష్ మీద ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచే విజయకేతనంతో సంబురాలు చేసుకుంటున్నారు. ఊరేగింపులు నిషేధం ఉన్నప్పటికీ విజయానందాన్ని అభ్యర్థులు ఆపుకోలేక పోతున్నారు. 112వ డివిజన్ ఆర్సీపురం టీఆర్ఎస్ అభ్యర్థిని పుష్ప.. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్‌పై 3,459 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దీంతో ఆమెను కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తారు. పుష్ప.. వాళ్లతో కలిసి సంబరాల్లో మునిగిపోయారు. రామచంద్రపురంలో తిరుగులేని విజయాన్ని సొంతం […]

Update: 2020-12-04 06:32 GMT

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు జోష్ మీద ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచే విజయకేతనంతో సంబురాలు చేసుకుంటున్నారు. ఊరేగింపులు నిషేధం ఉన్నప్పటికీ విజయానందాన్ని అభ్యర్థులు ఆపుకోలేక పోతున్నారు. 112వ డివిజన్ ఆర్సీపురం టీఆర్ఎస్ అభ్యర్థిని పుష్ప.. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నర్సింగ్ గౌడ్‌పై 3,459 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దీంతో ఆమెను కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తారు. పుష్ప.. వాళ్లతో కలిసి సంబరాల్లో మునిగిపోయారు. రామచంద్రపురంలో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె.. ఆ విజయాన్ని భర్తకు అంకితంగా ఇచ్చింది. ఈ సందర్భంగా విజయ దుందుబీ మోగించిన పుష్పను భర్త నగేశ్ ముద్దులతో ముంచెత్తాడు.

Tags:    

Similar News