ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీల పనితీరుపై సమీక్షకు ఆరుగురితో ఆర్‌బీఐ కమిటీ
దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీల (ఏఆర్‌సీలు) పనితీరుపై సమగ్రమైన సమీక్ష చేపట్టడానికి ఆర్‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్ అధ్యక్షతలో ఆరుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏఆర్‌సీల విషయంలో చట్టపరమైన, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను సమీక్షిస్తుంది. అలాగే వాటి సామర్థ్యాలను పెంచేందుకు తగిన చర్యలను సిఫార్సు చేయనుంది. దివాలా స్మృతి (ఐబీసీ)తో సహా ఒత్తిడితో కూడిన మొండి బకాయిలకు పరిష్కారాలను అందజేయనుంది. 2021 జనవరి చివరి నాటికి […]
దిశ, వెబ్‌డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీల (ఏఆర్‌సీలు) పనితీరుపై సమగ్రమైన సమీక్ష చేపట్టడానికి ఆర్‌బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్ అధ్యక్షతలో ఆరుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఏఆర్‌సీల విషయంలో చట్టపరమైన, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను సమీక్షిస్తుంది. అలాగే వాటి సామర్థ్యాలను పెంచేందుకు తగిన చర్యలను సిఫార్సు చేయనుంది. దివాలా స్మృతి (ఐబీసీ)తో సహా ఒత్తిడితో కూడిన మొండి బకాయిలకు పరిష్కారాలను అందజేయనుంది. 2021 జనవరి చివరి నాటికి ఆర్‌బీఐలో నమోదైన ఏఆర్‌సీల సంఖ్య 28 గా ఉంది. ఈ కమిటీలో ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాఖ ముల్యే, మాజీ ఎస్‌బీఐ డీఎండీ పీఎన్ ప్రసాద్, ఈవై పార్టనర్ అబిజ్ దివాన్‌జీ, ఎండీఐ ఎకనమిక్స్ ప్రొఫెసర్ రోహిత్ ప్రసాద్, చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ ఆనంద్ ఉన్నారు. ఈ కమిటీ మొదటి సమావేశం జరిగిన తేదీ నుంచి మూడు నెలల్లోగా నివేదికను సమర్పించనున్నాయి.