క్రికెట్‌తో 40 ఏళ్ల ప్రయాణం
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి టెస్టు క్రికెట్ ఆడటం మొదలు పెట్టి ఫిబ్రవరి 21 (ఆదివారం) నాటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. 40 ఏళ్ల క్రితం వెల్లింగ్టన్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టులో అరంగేట్రం చేసిన రవిశాస్త్రి.. క్రికెటర్‌గా కెరీర్ ముగిసినా ఇంకా ఆటతోనే కొనసాగుతున్నాడు. తొలి టెస్టు ఆడి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. టీమ్ ఇండియాతో ప్రయాణించడం తనకు […]
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ప్రధాన కోచ్ రవిశాస్త్రి టెస్టు క్రికెట్ ఆడటం మొదలు పెట్టి ఫిబ్రవరి 21 (ఆదివారం) నాటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. 40 ఏళ్ల క్రితం వెల్లింగ్టన్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెస్టులో అరంగేట్రం చేసిన రవిశాస్త్రి.. క్రికెటర్‌గా కెరీర్ ముగిసినా ఇంకా ఆటతోనే కొనసాగుతున్నాడు. తొలి టెస్టు ఆడి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. టీమ్ ఇండియాతో ప్రయాణించడం తనకు చాలా గొప్పగా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్‌గా 11 ఏళ్ల పాటు టీమ్ ఇండియా తరపున ఆడిన రవిశాస్త్రి 80 టెస్టులు, 150 వన్డేలు ఆడారు, టెస్టుల్లో 3830 పరుగులు, 151 వికెట్లు తన ఖాతాలో ఉన్నాయి. వన్డేల్లో 3108 పరుగులు, 129 వికెట్లు తీశాడు. 1983లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రవిశాస్త్రి కూడా ఉన్నాడు. రంజీ క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టిన రికార్డు ఇప్పటికీ రవిశాస్త్రి పేరిటే ఉన్నది. క్రికెటర్‌గా రిటైర్ అయిన తర్వాత వ్యాఖ్యాతగా, టీమ్ ఇండియా మేనేజర్‌గా, డైరెక్టర్‌గా పనిచేసిన రవి.. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.