డీసీసీబీని ప్రక్షాళన చేస్తా: రవీందర్ రావు
దిశ,వరంగల్: అర్హతలు కలిగిన రైతులకు రుణాలు అందజేసేలా కృషి చేస్తానని డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. వరంగల్‌లోని డీసీసీబీ కార్యాలయంలో ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అభినందించారు. అనంతరం రవీందర్‌రావు మాట్లాడుతూ పార్టీలో తనకంటే సీనియర్లు ఉన్నా ఈ పదవి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయాలలో క్రియాశీలకంగా 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని, ఇప్పటి వరకు ఎలాంటి అవకతవకలకు […]
దిశ,వరంగల్: అర్హతలు కలిగిన రైతులకు రుణాలు అందజేసేలా కృషి చేస్తానని డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. వరంగల్‌లోని డీసీసీబీ కార్యాలయంలో ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అభినందించారు. అనంతరం రవీందర్‌రావు మాట్లాడుతూ పార్టీలో తనకంటే సీనియర్లు ఉన్నా ఈ పదవి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయాలలో క్రియాశీలకంగా 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్నానని, ఇప్పటి వరకు ఎలాంటి అవకతవకలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు. గతంలో పని చేసిన వారు కొన్ని అవకతవకలకు పాల్పడ్డారని, రాబోయే రోజుల్లో డీసీసీబీని ప్రక్షాళన చేసి బ్యాంకుకు పూర్వ వైభవం తీసుకువస్తానని రవీందర్ చెప్పుకొచ్చారు.
tag: dccb chairman, ravidhar, warangal